Balakrishna C Kalyan : రూ.200 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ లో బాలయ్య.. రికార్డులు బద్దలవ్వాల్సిందే!

Balakrishna Playing Keyrole In 200 Crores Rupees Project Details Here Goes Viral , Balakrishna,C Kalyan ,Ramanujacharya Movie,Dil Raju ,Chinaziyar Swamy, Ravi Kottarakara

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ సినిమాలన్నీ పరిమిత బడ్జెట్ లోనే తెరకెక్కుతున్నాయి.బాలయ్య సినిమాలేవీ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కలేదనే సంగతి తెలిసిందే.

 Balakrishna Playing Keyrole In 200 Crores Rupees Project Details Here Goes Vira-TeluguStop.com

అయితే ప్రముఖ నిర్మాతలలో ఒకరైన సి.కళ్యాణ్ బాలయ్యతో 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఒక సినిమాను నిర్మించాలని భావిస్తున్నారు.ఈ ప్రాజెక్ట్ లో బాలయ్య నటిస్తే రికార్డులు బద్దలవ్వాల్సిందేనని తెలుస్తోంది.

ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.

బాలయ్యతో రామానుజచార్య మూవీని ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా షూట్ చేయాలని భావిస్తున్నామై సి.కళ్యాణ్ చెప్పుకొచ్చారు.బాలయ్య ఈ ప్రాజెక్ట్ లో నటిస్తే మాత్రం రికార్డులు బద్ధలవ్వాల్సిందే అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.చినజీయర్ స్వామి, రవి కొట్టారకర, ఇంటర్నేషనల్ సంస్థతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తానని సి.కళ్యాణ్ అన్నారు.

దాదాపుగా 200 కోట్ల రూపాయలతో కళ్యాణ్ అమ్యూస్మెంట్ పార్క్ ను నిర్మిస్తున్నామని ఈ ప్రాజెక్ట్ ను దేవుడిచ్చిన వరం అని భావిస్తానని ఆయన తెలిపారు.

సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రజలకు కావాల్సిన వినోదం, ఆహారం ఇందులో ఉంటాయని ఆయన కామెంట్లు చేశారు.షూటింగ్ లను ఆపేసి నిర్మాతలు చర్చలు జరపడం తన దృష్టిలో ఫ్లాప్ షో అని సి.కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.

Telugu Balakrishna, Kalyan, Dil Raju, Ramanujacharya-Movie

లోపాలు, సమస్యలను గుర్తించినా వాటి అమలు జరగలేదని ఆయన చెప్పుకొచ్చారు.కీడు చేసే గుణం ఉన్నవాళ్లు ఇండస్ట్రీ నుంచి జీరోలుగానే వెళ్లారని సి.కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.వారసుడు మూవీ విషయంలో దిల్ రాజు రెండు నాల్కల ధోరణి అవలంబించారని సి.కళ్యాణ్ పేర్కొన్నారు.సి.కళ్యాణ్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఆయన చెప్పిన విషయాలు నిజమేనని చాలామంది సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube