'భగవంత్ కేసరి' హిట్టు.. భారీగా పెంచేసిన బాలయ్య.. నెక్స్ట్ కోసం అన్ని కోట్లు?

నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) ఇప్పుడు క్రేజీ లైనప్ సెట్ చేసుకున్నాడు.ఈ మధ్య కాలంలో ఈయన మరింత హుషారుగా ముందుకు వెళుతున్నారు.

చేతిలో ఒక సినిమా ఉండగానే మరో సినిమాను ప్రకటిస్తూ ఫుల్ జోష్ లో ఉంటున్నాడు.ప్రస్తుతం బాలయ్య హ్యాట్రిక్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.

అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని ఫుల్ ఖుషీగా ఉన్నాడు.దసరా సీజన్ లో భగవంత్ కేసరి సినిమాతో బరిలోకి దిగిన బాలయ్యకు మరో 100 కోట్ల సినిమా దక్కింది.ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో బాలయ్య క్రేజ్ అమాంతం పెరిగింది.

దీంతో బాలయ్య రెమ్యునరేషన్ ను కూడా భారీగానే పెంచేసినట్టు తెలుస్తుంది.నెక్స్ట్ బాలయ్య చేస్తున్న సినిమాకు ఏకంగా 28 కోట్ల రెమ్యునరేషన్ అందుకోనున్నాడట.బాలయ్య భగవంత్ కేసరి తర్వాత యంగ్ డైరెక్టర్ బాబీ( Director Bobby ) దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేసాడు.

Advertisement

ఈ సినిమా షూట్ కూడా స్టార్ట్ అయ్యింది.ఈ సినిమాకే బాలయ్య ఏకంగా 10 కోట్లు పెంచేసినట్టు తెలుస్తుంది.

వీరసింహారెడ్డి

సినిమాకు 14 అందుకోగా భగవంత్ కేసరి సినిమా కోసం 18 కోట్లు తీసుకున్నాడు.

ఇక బాబీతో చేస్తున్న సినిమాకు ఏకంగా 28 కోట్లు అందుకుంటున్నారని సమాచారం.ఇలా ఒక్కో సూపర్ హిట్ పడుతుంటే రెమ్యునరేషన్ కూడా పెరుగుతూ పోతుంది.

Advertisement

తాజా వార్తలు