స్టార్ హీరో బాలయ్య 62 సంవత్సరాల వయస్సులో ఒక యాడ్ లో చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.గతంలో కమర్షియల్ యాడ్స్ లో నటించడానికి ఛాన్స్ వచ్చినా రిజెక్ట్ చేసిన బాలకృష్ణ ఇప్పుడు యాడ్ లో నటించడానికి ఓకే చెప్పడం గురించి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేయడం వల్లే బాలయ్య యాడ్ కు ఓకే చెప్పారని మరి కొందరు కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.
అయితే బాలయ్య గురించి నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్లు వాస్తవాలు తెలుసుకోవాలంటూ బాలాయ్య అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
యాడ్ కోసం బాలయ్య పరిమితంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని భారీ మొత్తంలో బాలయ్య రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని ఫ్యాన్స్ చెబుతుండటం గమనార్హం.యాడ్ కోసం తీసుకున్న డబ్బును బాలయ్య బసవతారకం ఆస్పత్రి కోసం ఖర్చు చేస్తున్నారని ఫ్యాన్స్ చెబుతున్నారు.
బాలయ్య బాబు చాలా మంచి వ్యక్తి అని ఆయన గురించి తప్పుగా కామెంట్లు చేయవద్దని ఫ్యాన్స్ కోరుతున్నారు.

బాలయ్య ఎప్పుడూ ఇతరులకు మంచి జరగాలని కోరుకుంటాడని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండటం గమనార్హం.బాలయ్య107 సినిమాకు వీరసింహారెడ్డి టైటిల్ ఫైనల్ అయింది.వీరసింహారెడ్డి సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శృతిహాసన్ నటించారు.

బాలయ్య, శృతి హాసన్ ఈ సినిమా రిజల్ట్ విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.అభిమానులకు నచ్చే సీన్లు ఈ సినిమాలో ఉన్నాయని గోపీచంద్ మలినేని చెబుతున్నారు.బాలయ్య ఈ సినిమాకు భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం అందుతోంది.
బాలయ్య మాస్ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.బాలయ్య తర్వాత సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.







