హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.మరి ముఖ్యంగా చెప్పాలి అంటే సినిమాల కంటే ఎక్కువగా రాజకీయలపైన శ్రద్ధ చూపుతున్నారు.
ముందుగా కమిట్ అయిన సినిమాలను పక్కన పెట్టేసి మరి రాజకీయాలలో మరింత యాక్టివ్గా పాల్గొంటున్నారు.ఇటీవలే మంగళగిరిలో పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎంత సంచలనం సృష్టించిందో మన అందరికీ తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ కు ఒక ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు అని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే.క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు.
ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు.కాగా ఇప్పటికే ఈ సినిమా 70% షూటింగ్ ను పూర్తి చేసుకుంది.
ఈ సినిమాతో పాటుగా మరోవైపు పవన్ కళ్యాణ్ వినోదయ సీతం సినిమాకు కూడా డేట్స్ ఇచ్చేశాడు.ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ నవంబర్లో మొదలుకానుంది.
అయితే ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా 70 శాతం షూటింగ్ పూర్తి కాగా కేవలం పై శాతం షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది.ఇటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను ఆపి వినోదయ సీతం రీమిక్ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.ఎందుకంటే ఈ సినిమా కోసం కేవలం పవన్ కళ్యాణ్ 20 రోజులు మాత్రమే షూటింగ్ చేస్తే సరిపోతుందట.షూటింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర మొదలుపెట్టి కార్యక్రమంలో పాల్గొనబోతున్నాడు.
దీంతో హరిహర వీరమల్లు షూటింగ్ మరొకసారి వాయిదా పడినట్లే అని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ వార్త విన్న అభిమానులు మరొకసారి నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఈ హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉండగా ఈ సినిమా మరింత లేట్ అవుతూ ఉండడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్.