మామూలుగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలకు( celebrities ) మాత్రమే కాకుండా క్రీడారంగంలో ఉండే ప్రముఖులకు కూడా భారీగా అభిమానులు క్రేజ్ ఉంటుంది.సినిమాలను ఆదరించే వారు ఎంతమంది ఉంటారు క్రీడలను కూడా ఆదరించే వారు అంతే మంది ఉంటారని చెప్పవచ్చు.
అయితే ఆయా రంగానికి చెందిన సెలబ్రిటీలను కలవాలి అని ప్రతి ఒక్క అభిమాని కోరుకున్నప్పటికీ అది అంత సులువైన పని కాదని చెప్పవచ్చు.కేవలం డై హార్డ్ ఫ్యాన్స్ మాత్రమే ఇలా సెలబ్రిటీలను కలిసే అవకాశాలు వస్తాయి అని చెప్పవచ్చు.

ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ ఫ్యాన్ కూడా ఆ కోవకే చెందుతాడు అని చెప్పవచ్చు.అతని పేరు కార్తికేయ పాడి( Karthikeya padi ).చిన్నప్పటి నుంచి నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) కు వీరాభిమాని.అయితే ప్రస్తుతం కార్తికేయ పాడి డాక్టర్ బి.వి.రాజు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్ మొదటి సంవత్సరం కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు.స్వతహాగా ఫుట్ బాల్ ప్లేయర్ అయిన కార్తికేయ రాయల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ లో ఓకల్ వెస్ట్రన్, పియానో 5వ గ్రేడ్ ఉత్తీర్ణత కూడా సాధించాడు.నందమూరి బాలకృష్ణ వందవ చిత్రం అయిన గౌతమీ పుత్ర శాతకర్ణి ( Gautami putra shatakarni )సినిమాలో కార్తికేయకు నటించే అవకాశం వచ్చినా పరీక్షల కారణంగా ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు.

ఇదిలా ఉంటే స్కూల్, కాలేజీలో ఫుట్ బాల్ క్రీడాకారుడైన కార్తికేయ ఇటీవల తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నాడు.తన అభిమాన ఫుట్ బాల్ ప్లేయర్ ఎమిలియానో మార్టినెజ్‌ను( Emiliano Martinez ) కోల్‌కతా వెళ్లి కార్తికేయ కలిశాడు.1986లో డిగో మారడోనా సారథ్యంలో అర్జెంటీనా ప్రపంచకప్ గెలిచిన తర్వాత చాలా సంవత్సరాలకు 2022లో కతార్‌లో జరిగిన ప్రపంచ కప్ పోటీల్లో విజేతగా అర్జెంటీనా తిరిగి అవతరించింది.ఈ ఘన విజయాన్ని సొంతం చేసుకోవడం వెనుక గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్ పాత్ర కీలకమైంది.
కాగా ఆయన ఈ ఏడాది జూలై 4, 5 తేదీలలో భారత్‌ను సందర్శించాడు.కోల్‌కతాలోని మోహన్ బగాన్ క్లబ్‌లో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడు.
మార్టినెజ్ భారత పర్యటన గురించి తెలుసుకున్న కార్తికేయ కోల్‌కతా వెళ్లి మార్టినెజ్‌ను కలిశాడు.ఆయనను కలవడంతో పాటు 2022 ప్రపంచకప్ రిప్లికాతో ఫోటో దిగాడు.అలానే మార్టినెజ్‌ను ఆయన విడిదిలో ప్రత్యేకంగా కలిసి, అర్జెంటీనా జెర్సీపై ఆటోగ్రాఫ్‌ను తీసుకున్నాడు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.