బాలయ్య కూతురుకు పవన్ అంటే ఇంత అభిమానమా.. షాకింగ్ విషయాలు రివీల్!

స్టార్ హీరో బాలకృష్ణ క్రమశిక్షణకు ఎంతగానో ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే.కూతుళ్లు, కొడుకును బాలయ్య ఎంతో క్రమశిక్షణతో పెంచారు.

 Balakrishna Daughter Tejaswini Big Fan Of Pawan Kalyan Details Here Goes Viral-TeluguStop.com

బాలయ్య కుటుంబ సభ్యులు మీడియాకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే.అయితే బాలయ్య చిన్న కూతురు తేజస్వినికి పవన్ కళ్యాణ్ అంటే అభిమానమని సమాచారం.

అన్ స్టాపబుల్ షో సీజన్2 కు తేజస్విని క్రియేటివ్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నారు.

అయితే గతంలో ప్రోమోలలో, అన్ స్టాపబుల్ సెట్స్ లో ఎప్పుడూ కనిపించని తేజస్విని అన్ స్టాపబుల్ సెట్ లో పవన్ ఎపిసోడ్ సమయంలో కనిపించడంతో పవన్ కు తేజస్విని వీరాభిమాని అని ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ ప్రచారం గురించి అధికారికంగా స్పష్టత వస్తే మాత్రమే బాగుంటుందని కొంతమంది నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.వైరల్ అవుతున్న వార్త పవన్ ఫ్యాన్స్ కు మాత్రం సంతోషాన్ని కలిగిస్తోంది.

అన్ స్టాపబుల్ షోకు పవన్ హాజరైన ఎపిసోడ్ చివరి ఎపిసోడ్ గా ప్రసారం కానుండగా ఈ ఎపిసోడ్ కొరకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అన్ స్టాపబుల్ షో అంచనాలను మించి మెప్పిస్తుండగా బాలయ్య ప్రభాస్ కాంబో ఎపిసోడ్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.

బాలయ్య ప్రభాస్ కలిస్తే మామూలుగా ఉండదని ఈ ఎపిసోడ్ తో ప్రూవ్ అయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అటు బాలయ్య ఇటు ప్రభాస్ ప్రస్తుతం వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ప్లాన్ చేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తుండగా రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది.అన్ స్టాపబుల్ షో వల్ల బాలయ్య ప్రభాస్ మధ్య అనుబంధం ఊహించని స్థాయిలో పెరిగింది.

బాలయ్య పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కూడా బాగా వచ్చిందని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube