అలా చేసి ఉంటే వాల్తేరు వీరయ్య ఇండస్ట్రీ హిట్.. ఫ్యాన్స్ కామెంట్లు విన్నారా?

సంక్రాంతి పండుగ కానుకగా విడుదలవుతున్న వాల్తేరు వీరయ్య సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.చిరంజీవి, రవితేజ కలిసి ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

 Waltheru Veeraya Become Industry Hit Details Here Goes Viral In Social Media , W-TeluguStop.com

అయితే అభిమానుల మధ్య చిరంజీవి, పవన్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కి ఉంటే బాగుండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఆకాశమే హద్దుగా పవన్ కళ్యాణ్ కు క్రేజ్ ఉండగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫుల్ లెంగ్త్ రోల్స్ లో నటిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

వాల్తేరు వీరయ్యలో 45 నిమిషాల నిడివి ఉన్న రోల్ లో పవన్ కనిపించి ఉంటే ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా ఇండస్ట్రీ హిట్ గా నిలిచేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీకి పవన్ కళ్యాణ్ తో కూడా మంచి అనుబంధం ఉంది.

బాబీ ప్రయత్నించి ఉంటే ఈ కాంబినేషన్ ను సెట్ చేయడం కష్టమేం కాదు.చిరంజీవి, పవన్ నిజ జీవితాల్లో ఒకరికొకరు ఎన్నోసార్లు సపోర్ట్ చేసుకున్నారు.

అయితే రాబోయే రోజుల్లో అయినా ఈ కాంబినేషన్ సెట్ అయితే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.రాజమౌళి డైరెక్షన్ లో ఈ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కితే బాగుంటుందని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

జక్కన్న తలచుకుంటే ఈ కాంబినేషన్ ను సెట్ చేయడం ఏ మాత్రం కష్టం కాదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో చిరంజీవి మెయిన్ హీరోగా నటించగా పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ కాలేదు.రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ కచ్చితంగా రిపీట్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

చిరంజీవి, పవన్ కాంబోలో మూవీ అంటే రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగే ఛాన్స్ అయితే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube