భగవంత్ కేసరి టైటిల్ వెనుక ఇంత పెద్ద రహస్యం ఉందా?

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందిన నేలకొండ భగవంత్ కేసరి సినిమా( Bhagavanth Kesari ) ఈ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

ఈ టైటిల్ విషయం లో దర్శకుడు అనిల్ రావిపూడి భలే ఆలోచించాడే అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

నేలకొండ భగవంత్ కేసరి టైటిల్‌ ని ఒక సారి పరిశీలిస్తే నేలకొండ లో ఎన్‌, భగవంత్ లో బి మరియు కేసరిలో కే ని తీసుకుంటే ఎన్‌ బీ కే అవుతుంది.అంటే నందమూరి బాలకృష్ణ( Balakrishna ) యొక్క ఫ్యాన్స్ పిలుచుకునే ముద్దు పేరు ఎన్‌ బీ కే.బాలయ్య పేరు కలిసి వచ్చేలా నేలకొండ భగవంత్ కేసరి అంటూ భలే సెట్ చేశారు అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

టైటిల్ విషయం లో దర్శకుడు ఇంత రహస్యంను దాచాడా అంటూ నెటిజన్స్ కూడా అవాక్కవుతున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ విషయం గురించి తెగ చర్చ జరుగుతోంది.బాలయ్య కి ఇలాంటి పవర్‌ ఫుల్‌ టైటిల్స్ పెట్టిన సమయంలో భారీ విజయాలు దక్కించుకున్న సందర్భాలు ఉన్నాయి.

కనుక భగవంత్ కేసరి కూడా సూపర్‌ హిట్ అయినట్లే అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా లో శ్రీ లీల( Sreeleela ) కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే.

Advertisement

ఇక బాలయ్య కు జోడీగా ఈ సినిమా లో ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్‌ నటించడం జరిగింది.ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

ట్రైలర్‌ రిలీజ్ తర్వాత సినిమా పై ఫ్యాన్స్ లో మరింత అంచనాలు పెరిగాయి.విభిన్నమైన కాన్సెప్ట్‌ తో ఈ సినిమా భారీ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్ గా దర్శకుడు రూపొందించినట్లుగా ట్రైలర్‌( Bhagavanth Kesari Trailer )) ని చూస్తూ ఉంటే అనిపిస్తుంది అంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బాలయ్య ఈ సినిమా తో విజయాల హ్యాట్రిక్ ని దక్కించుకుంటారా అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు