రెండు దశాబ్దాల క్రితం టాలీవుడ్ స్టార్ హీరోలు అంటే నలుగురి పేర్లు ముందుగా వినిపించేవి.అందులో మొదటి పేరు చిరంజీవి కాగా, రెండో పేరు బాలకృష్ణ ఆ తర్వాత నాగార్జున మరియు వెంకటేష్( Venkatesh ) ల పేర్లు ఉండేవి.
దాదాపు టాలీవుడ్ లో రెండు దశాబ్దాల పాటు వీరు నలుగురు టాప్ 4 గా కొనసాగుతూ వచ్చిన విషయం తెల్సిందే.అయితే తరాలు మారుతున్నా కొద్ది హీరోల క్రేజ్, స్టార్ డమ్ తగ్గుతూ ఉంటుంది.

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ), మహేష్ బాబు, ఎన్టీఆర్, చరణ్, బన్నీ వంటి వారు వచ్చిన తర్వాత వీరికి అసలు సినిమాలు రావడమే గొప్ప అన్నట్లుగా పరిస్థితి ఉంది.కొందరు సరైన కథలు లేకపోవడంతో సినిమా లు చేయడం మానేస్తున్నారు.ఇలాంటి సమయంలో బాలయ్య( Balakrishna ) మాత్రం బ్యాక్ టు బ్యాక్ మూడు వంద కోట్ల సినిమా లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి సంచలనం సృష్టించాడు.ఈ మధ్య కాలం లో ఏ ఒక్క సీనియర్ స్టార్ హీరో కూడా ఈ ఫీట్ ను దక్కించుకోలేదు.
కేవలం తెలుగు హీరో ల్లోనే కాకుండా ఏ సౌత్ సీనియర్ స్టార్ హీరో లు కూడా ఈ స్థాయి లో మూడు విజయాలను బ్యాక్ టు బ్యాక్ తన ఖాతా లో వేసుకోలేదు.

కనుక ఇది బాలయ్య కు అరుదైన రికార్డ్ గా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.బాలకృష్ణ మరియు అనిల్ రావిపూడి కాంబో లో వచ్చిన భగవంత్ కేసరి ( Bhagavanth kesari movie )సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరింది.స్వయంగా చిత్ర యూనిట్ సభ్యులు ఈ విషయాన్ని ప్రకటించారు.లాంగ్ రన్ లో సినిమా రూ.175 కోట్ల వరకు రాబట్టే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.అంతకు ముందు బాలయ్య నటించిన అఖండ మరియు వీర సింహా రెడ్డి సినిమా లు కూడా వంద కోట్ల మార్క్ ను దాటిన విషయం తెల్సిందే.బాలయ్య ముందు మరిన్ని రికార్డు లు దక్కించుకోవడం ఖాయం అన్నట్లుగా అభిమానులు ధీమాతో ఉన్నారు.