నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు( Gummadi Venkateswara Rao ).ఈయన గురించి ఈ తరం ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు కానీ ఆ తరం ప్రేక్షకులు ఇట్టే గుర్తుపట్టేస్తారు.
భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన జ్ఞాపకాలు మాత్రం ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి.కొన్ని వందల సినిమాలలో నటించి మెప్పించారు గుమ్మడి వెంకటేశ్వరరావు.
అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన కుమార్తె శారద( Sharada ) తన తండ్రి గుమ్మడి వెంకటేశ్వరరావు పడ్డ ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు.

అంతేకాకుండా మహానటి సావిత్రి( Savitri )తో తన తండ్రి కి ఉన్న అనుబంధం గురించి కూడా వెల్లడించింది.ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ.మా నాన్న మమ్మల్ని చాలా స్ట్రిక్ట్‌గా పెంచారు.
అలాగే ఆయన ఏ నటుడితోను పోటీ పడకుండా వచ్చిన సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్లారు.ఎంతోమంది నటులు, రచయితలు, టెక్నీషియన్స్‌కి ఛాన్సులు ఇప్పించారు.
ప్రస్తుతం వారు మంచి స్ధాయిలో ఉండి బయట ఇంటర్వ్యూలు ఇస్తూ ఒక్కరూ తమ తండ్రి పేరు తలవకపోవడం నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది అంటూ శారద ఆవేదన వ్యక్తం చేసారు.చాలామంది ప్రొడ్యూసర్లు తన తండ్రికి డబ్బులు ఎగ్గొట్టారన ఆమె తెలిపింది.
క్రమశిక్షణ, అంకిత భావంతో తన తండ్రి గుమ్మడి సినిమా ఇండస్ట్రీలో పని చేసారని శారద చెప్పారు.

అలాగే నాన్నకు పెరాల్సిస్ వచ్చిన సందర్భంలో స్వర పేటిక దెబ్బ తిని కొంతకాలం సినిమాలకు దూరం అయ్యారని ఆ తర్వాత గుండె బలహీన పడటం.ఓపెన్ హార్ట్ సర్జరీ అవ్వడం కారణంగా సినిమాలకు దూరమయ్యారని తెలిపింది.అలాగే సీనియర్ నటి సావిత్రితో మా తండ్రికి ప్రత్యేక అనుబంధం ఉంది.
ఆమెను సొంత చెల్లిగా భావించేవారు.ఎవరిని సాయం అడిగే మనస్తత్వం కాకపోవడం వల్లే ఎవరి చేయూత అందక సావిత్రి గారు చివరి దశలో కష్టాలు ఎదుర్కున్నారు.
మా తండ్రి గుమ్మడిని అందరూ గుర్తు పెట్టుకోవడం గుర్తించడం తమకెంతో గర్వకారణం అని తెలిపింది శారద.







