బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ సినిమా అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది.భారీ విజయాన్ని సొంతం చేసుకున్న అఖండ సినిమా 100 కోట్లకు పైగా వసూళ్లను దక్కించుకుంది.
భారీ అంచనాలున్న అఖండ సినిమా ను జనాలు అదే స్థాయిలో విజయాన్ని చేయడం జరిగింది.అఖండ సినిమా లో బాలయ్య ద్వి పాత్రాభినయం చేయడం జరిగింది.
ఈ సినిమా విడుదల అయ్యి అయిదు వారాలు పూర్తి అయ్యి ఆరవ వారంలోకి అడుగు పెట్టింది.ఈమద్య కాలంలో మూడు వారాలు సినిమా ఆడితే గొప్ప విషయం.
కాని ఈ సినిమా ఆరు వారాలు పూర్తి చేసుకోవడం గొప్ప విషయంగా చెప్పుకుంటున్నారు.ఈ సినిమా ను సంక్రాంతి తర్వాత కూడా స్ట్రీమింగ్ చేయాబోవడం లేదు.
హాట్ స్టార్ లో ఈ సినిమా ను మరో రెండు వారాల తర్వాత కాని స్ట్రీమింగ్ చేయబోవడం లేదు. ఈ సినిమా 50 డేస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.అందుకోసం హాట్ స్టార్ ను ఒప్పించారు.50 రోజులు పూర్తి చేసుకోవడం అనేది ఈమద్య కాలంలో ఏ ఒక్క సినిమాకు సాధ్యం కాలేదు.
బాహుబలి 2 తర్వాత ఇప్పటి వరకు మరే సినిమా కూడా 50 రోజులు ఆడిన దాఖలాలు లేవు.కాని అఖండ సినిమా 50 రోజులను కనీసం 50 థియేటర్లోల పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు.ఇదే కనుక నిజం అయితే ఖచ్చితంగా బాలయ్య ఒక రేంజ్ రికార్డు ను నమోదు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.అరుదైన రికార్డును సొంతం చేసుకోబోతున్న బాలయ్య ఖచ్చితంగా టాలీవుడ్ టాప్ స్టార్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
బాలకృష్ణ మరియు ప్రగ్యా జైస్వాల్ జంటగా నటించిన ఈ సినిమా లో శ్రీకాంత్ విలన్ గా నటించాడు.భారీ అంచనాల నడుమ రూపొందిన అఖండ సినిమా నైజా ఏరియాలో ఏకంగా 20 కోట్ల షేర్ ను దక్కించుకుని ఆల్ టైమ్ రికార్డును దక్కించుకున్న బాలయ్య మరో రెండు వారాల పాటు బాక్సాఫీస్ వేట కొనసాగించబోతున్నట్లుగా దీన్ని బట్టి క్లారిటీ వచ్చింది.