ఇటీవల రిలీజ్ అయిన సినిమాల్లో మంచి కలక్షన్స్ తో పాటు మంచి పేరుని కూడా రాబట్టుకున్న సినిమా బలగం…( Balagam ) అయితే ఈ బలగం సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే క్లయిమాక్స్ లో బుర్ర కధ మరో ఎత్తు .ఆ కధలో తన గాత్రంతో ప్రేక్షకులతో కంటతడి పెట్టించారు మొగిలయ్య .
( Mogilaiah ) ఒక్క పాటతో తెలుగువారందరికీ సుపరిచితమైన గాయకుడు మొగిలయ్య గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.కొద్దిరోజులుగా వరంగల్లో చికిత్స పొందుతున్నాడు.తాజాగా డయాలసిస్ నిర్వహిస్తుండగా, మొగిలయ్యకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది.దాంతో కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటినా హైదరాబాద్ తరలించారు.
ప్రస్తుతం మొగిలయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.వరంగల్ జిల్లా దుగ్గొండికి చెందిన పస్తం మొగిలయ్య రెండేళ్ల క్రితం కరోనా బారిన పడ్డారు.
ఆ తర్వాత కిడ్నీల సమస్య వచ్చి కిడ్నీలు ఫెయిల్( Kidney Failure ) అయ్యాయి.షుగర్, బీపీ పెరగడంతో కంటి చూపు కూడా దెబ్బతింది.
కొంత కాలం క్రితం చేయి కూడా విరిగింది.ఇక మొగిలయ్య, కొమురమ్మ దంపతులు బుర్రకథలు చెప్పుకుంటూ పొట్ట నింపుకునే వారు.
ఊరూరా బుర్ర కథలు చెబుతూ మొగిలియ్య కుటుంబం కొన్నేళ్ల క్రితం దుగ్గొండికి వలస వచ్చింది.అప్పటి ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటిలోనే ఉంటున్నారు.

ప్రస్తుతం ఆ ఇంటిపై కప్పు కూలిపోవడంతో పరదా చాటున కాలం వెళ్లదీస్తున్నారు.ప్రస్తుతం కుమారుడు సుదర్శన్ స్టీల్ సామాన్ల వ్యాపారం చేస్తున్నాడు.భార్యభర్తలిద్దరూ నిరక్షరాస్యులైనా సన్నివేశాన్ని బట్టి అప్పటికప్పుడు కథలు, పాటలు అల్లి రక్తికట్టించడం వారి ప్రత్యేకత.ఇక బలగయ్య అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకున్న సర్కార్ ఆయన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తుంది .మొగిలయ్య ఆరోగ్యంపై మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు.

ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు.అంతకు ముందు మొగిలయ్యను వరంగల్ నుంచి హైదరాబాద్‌కు తరలించాలని సంబంధిత అధికారులను మంత్రులు ఆదేశించారు.ఆయనకు కావాల్సిన పూర్తి వైద్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించనున్నట్టు ప్రకటించారు.
ఈ మేరకు ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తమని హామీ ఇచ్చారు .మొగిలయ్యకి ఇప్పుడు నిమ్స్ లో వైద్యం అందిస్తున్నారు
.







