పోర్నోగ్రాఫిక్ కేసులో అరెస్టయిన వ్యాపారవేత్త రాజుకుంద్రాకు బెయిల్

పోర్నోగ్రాఫిక్ కేసులో అరెస్టయిన వ్యాపారవేత్త రాజు కుంద్రా కు బెయిల్ లభించింది.  రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుతో ముంబై హైకోర్టు సోమవారం ఆయనకు బెయిల్ ఇచ్చింది.రాజ్ కుంద్రాతో పాటు ఆయన సంస్థలో ఒకదానికి ఐటీ చీఫ్ గా పనిచేస్తున్న ర్యాన్ థార్పేకూ బెయిల్ మంజూరైంది.

 Bail For Businessman Rajukundra Arrested In Pornographic Case,rajukundra , Busin-TeluguStop.com

రాజ్ కుంద్రా తరుపున న్యాయవాది ప్రశాంత్ పటేల్ వాదనలు వినిపించారు.పోర్నో గ్రాఫిక్ కంటెంట్ ను ప్లాట్ ఫారం లో అప్ లోడ్ చేయడం లో తన క్లయింట్ ప్రమేయం లేదన్నారు.

ఎలాంటి కంటెంట్ ను అప్ లోడ్ చేయాలన్నది నిర్మాతలు, ప్రముఖులు నిర్ణయిస్తారు.ర్యాన్, కుంద్రాకు సంబంధం లేదు.

1467 పేజీల ఛార్జ్ షీట్ లో నూ అప్ లోడ్ అంశంలోనూ తన క్లయింట్ కు సంబంధం ఉన్నట్లు ఎక్కడ ఒక్క ఆధారం కూడా లేదన్నారు.మరోవైపు ప్రాసిక్యూషన్ మాత్రం బెయిల్ ను వ్యతిరేకించారు.

బయటికి వెళితే సాక్ష్యాలు తారుమారు అయ్యే ప్రమాదం ఉందని వాదించారు.ఇరువురు వాదనలు విన్న న్యాయస్థానం చివరకు బెయిల్ మంజూరు చేసింది.

జూలైలో అరెస్ట్ అయిన కుంద్రా దాదాపు రెండు నెలల పాటు జైలులో గడిపారుఅశ్లీల కంటెంట్ ఉత్పత్తి పంపిణీకి సంబంధించి ర్యాన్, కుంద్రాలను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.తొలత ఏసీపీ స్థాయి అధికారులతో దర్యాప్తు జరిగినప్పటికీ అనంతరం కేసును సిట్ కు అప్పగించారు.

దాదాపు 100 అశ్లీల చిత్రాలను యూకే కు పంపారని ఇందులో కుంద్రా పాత్ర ఉందని ప్రాథమికంగా తేల్చారు.ఈ చిత్రాల నిర్మాణాన్ని కుంద్రానే స్వయంగా పర్యవేక్షించారని, ఆయన సొంత సంస్థకు చెందిన హాట్ షాట్స్ యాప్ లో వీటిని అప్లోడ్ చేశారని అభియోగాలు మోపబడ్డాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube