ఎస్ఈసీ కి హైకోర్టులో ఎదురుదెబ్బ..!! 

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గతంలో నామినేషన్ వేయని పరిస్థితి ఉన్నా వాటి చోట మళ్లీ నామినేషన్లు వేయవచ్చు అని సరికొత్త ఆదేశాలు ఇవ్వడం తెలిసిందే.

గత ఏడాది చాలా చోట్ల నామినేషన్ విత్ డ్రా చేసుకునే పరిస్థితులు ఉండటంతో ఫిర్యాదులు రావడంతో వాటిని కలెక్టర్లు ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లడంతో మళ్లీ నామినేషన్లు వేసుకోవచ్చని ఇటీవల ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడం జరిగింది.

దీంతో చాలామంది నిన్న ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లను వేయడం జరిగింది.అదే తరుణంలో మూడు గంటల వరకు ఉపసంహరణ కి అవకాశం కల్పించారు.

పరిస్థితి ఇలా ఉండగా ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయంపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించడంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్  మళ్లీ నామినేషన్లకు అనుమతిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది.అంతేకాకుండా వాలంటీర్ల పై నిమ్మగడ్డ విధించిన ఆంక్షలను కూడా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు