South Africa Bhavuma : అంతా మా తల రాత ఓటమిపై బవుమా కామెంట్స్.. వీడియో చూస్తే ఖచ్చితంగా నవ్వాల్సిందే..

ఈ సంవత్సరం ఆస్ట్రేలియాలో జరుగుతున్న టి20 ప్రపంచ కప్ 2022లో ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలగజేసేలా ఎన్నో సంచలనాలు జరిగాయి.

బౌలింగ్ లోను, బ్యాటింగ్ లోను ఎంతో బలంగా కనిపించే ఛాంపియన్ జట్లు టి20 ప్రపంచ కప్ 2022 లోకి హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగాయి.

ఈ టీం లకు అప్పటివరకు పెద్దగా అంతర్జాతీయ క్రికెట్లో గుర్తింపు లేని చిన్న టీమ్లు షాక్ ఇచ్చాయి.ఈ క్రమంలోనే కొన్ని జట్లను ఏకంగా సెమీఫైనల్ చీరనీయకుండా ఇంటికి పంపడం లో ఈ చిన్న క్రికెట్ జట్లు కీలక పాత్ర పోషించాయి.

ముఖ్యంగా కొన్ని రోజుల క్రితం జరిగిన సూపర్ 12 మ్యాచ్లలో భాగంగా సౌత్ ఆఫ్రికా నెదర్లాండ్స్ ల మధ్య జరిగిన మ్యాచ్లో నెదర్లాండ్స్ గెలవడంతో క్రికెట్ ప్రపంచం మొత్తం షాక్ కు గురైంది.ఒక్క నెదర్లాండ్స్ తప్ప.

అప్పటివరకు దక్షిణాఫ్రికా ఖచ్చితంగా సెమీఫైనల్స్ కు వెళ్లిపోయింది అని అనుకున్న అందరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.ప్రపంచ క్రికెట్ అభిమానులు పసికున నెదర్లాండ్స్ పై దక్షిణ ఆఫ్రికా క్రికెట్ టీం సులువుగా విజయం సాధిస్తుంది అని అందరూ అనుకున్నారు.

Advertisement

ఇలాంటి సమయంలో పసికూన నెదర్లాండ్స్ మాత్రం సౌత్ ఆఫ్రికా పై విజయం సాధించి ప్రపంచానికే కాదు యావత్ క్రికెట్ అభిమానులకు అందరికి షాక్ ఇచ్చింది.

ఏకంగా ప్రపంచ ఛాంపియన్ జట్టుపై చిన్న టీం అయినా నెదర్లాండ్స్ విజయం సాధించింది.దీనితో ఒక్కసారిగా ఆ చెట్టు సమీకరణాలన్నీ మారిపోయాయి.ఇక సౌత్ ఆఫ్రికా ఓటమి కారణంగా లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టింది.

అయితే సౌత్ ఆఫ్రికా ఓటమి పాలు కావడంపై జట్టు కెప్టెన్ బవుమ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అయితే ఇక ఇలా మ్యాచ్ అనంతరం భావుమా మాట్లాడిన వీడియోని తెలుగు డైలాగులతో మ్యాచ్ చేస్తూ కొంత మంది సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?
Advertisement

తాజా వార్తలు