బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్

యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు జగ్జీవన్ జయంతి వేడుకల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో బడుగు, బలహీన వర్గాల సాధికారతకు కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు.

దేశ రాజకీయ యవనికపై జగ్జీవన్ రామ్ చెరగని ముద్రవేశారని కొనియాడారు.నాలుగు దశాబ్దాల పాటు నవభారత నిర్మాణంలో కీలకపాత్ర పోషించారని అన్నారు.

భారత రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో ప్రజలకు న్యాయమైన సమాజాన్ని కల్పించడానికి బాబు జగ్జీవన్ రామ్ దళిత జనాభా యొక్క సామాజిక,రాజకీయ హక్కుల కోసం ధైర్యంగా వాదించారన్నారు.జగ్జీవన్ రామ్ 1946లో జవహర్లాల్ నెహ్రు యొక్క తాత్కాలిక ప్రభుత్వ మంత్రివర్గం లో అతి పిన్న వయస్కుడు అయ్యాడు అని అన్నారు.తదుపరి స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి క్యాబినెట్ కార్మిక మంత్రి అయ్యాడు.1952 వరకు కార్మిక మంత్రిగా పని చేశాడు.బాబు జగ్జీవన్ రామ్ తన పదవీ కాలంలో హరిత విప్లవం విజయవంతంగా అమలు చేయడానికి కీలక పాత్ర పోషించారు.

ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత దేశ మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్‌కు దక్కిందని అన్నారు.

Advertisement

దేశ ప్రజల సంక్షేమం కోసం వారి శ్రేయస్సు కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టిన మహనీయులలో బాబు జగ్జీవన్ ఒకరని కొనియాడారు.మహాత్మగాంధితో కలిసి క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా గుర్తుచేసారు.

జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలకు ఆహ్వానించిన అంబేద్కర్ యువజన సంఘం నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వేములవాడ రూలర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వకులభరణం శ్రీనివాస్, ఎదురుగట్ల సర్పంచ్ సోయీనేని కరుణాకర్, బండ శ్రీనివాస్, ఎడవెల్లి అనిల్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు ప్రశాంత్ తదితరులు ఉన్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News