ఏదైనా పదే పదే చెప్తే ఆ మాట చులకనైపోతుంది.తక్కవగా బలంగా వినిపిస్తే అది హైలైట్ అవుతంది.
చెప్పిన విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్తే లైట్ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.ఎప్పుడూ చెప్పేదేగా.
అంటూ నిట్టూర్చుతారు.అందుకే చాలా తక్కువ సందర్భాల్లో చెబితేనే దానికి విలువ ఉంటుంది.
అదే పనిగా చెప్పటం వల్ల సీరియస్ నెస్ కూడా తగ్గిపోతుంది.అయితే ప్రస్తుతం ఏపీలో బాబు చేస్తోంది అదే.రాబోయే ఎన్నికల గురించి.పదే పదే నేతలకు జాగ్రత్తలు చెప్తున్నారు.
ఎవరెన్ని చెప్పినా ఏపీలో సార్వత్రిక ఎన్నికలు 2024 మే ముందు జరిగే అవకాశమే లేదనే వాదన వినిపిస్తోంది.మరి అలాంటప్పుడు త్వరలో ఎన్నికలు రానున్నట్లుగా కొన్నిసార్లు.
అప్పుడప్పుడు ఎన్నికలకు తగిన సమయం లేదని.మరింత అలెర్ట్ కావాలని.దూకుడు పెంచాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసే వ్యాఖ్యలు ఎవరూ సీరియస్ గా తీసుకోరని అంటున్నారు.
ఎక్కువ టైమ్ లేదని…
తాజాగా ఆయన నోటి నుంచి ఇవే వ్యాఖ్యలు వినిపించాయి.రాష్ట్రంలో ఎన్నికలకు ఎక్కువ టైం లేదని.పార్టీ నేతలు.ఇన్ ఛార్జులు మరింత దూకుడు పెంచాలంటూ దిశా నిర్దేశం చేశారు.రానున్న ఏడాది అత్యంత కీలకమన్న ఆయన.అలసత్వం వీడి పక్కా ప్రణాళికతో పని చేయాలన్నారు.తాజాగా పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జిలను సమీక్ష నిర్వహిస్తున్న ఆయన.తొలిరోజు అవనిగడ్డ.పెనమలూరు.మార్కాపురం.సంతనూతలపాడు ఇన్ ఛార్జిలతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా ఏమేం చేయాలన్న అంశాలతో పాటు.నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయటం కోసం తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి చర్చించారు.
తన వద్ద ఉన్న నివేదికల ఆధారంగా మాట్లాడిన చంద్రబాబు.జగన్ సర్కారు వైఫల్యాలపై వారి ఎదుట ఏకరువు పెట్టి మరింత గట్టిగా పని చేయాలని చెప్పినట్లుగా చెబుతున్నారు.
అయితే బాబు అదే పనిగా చెప్తుండటంతో అవసరమా అంటున్నారు.

అయితే ఈ మాటలు కాకుండా పార్టీకి సంబంధించి నియోజకవర్గాల వారీగా అత్యధిక సంఖ్యలో అభ్యర్థులను ముందస్తుగా ప్రకటించటం ద్వారా.పార్టీలో మరింత జోష్ పెంచే వీలుంది.ఇలాంటి ప్రయత్నాల్ని వదిలేసి.
ఎన్నికలు వస్తున్నాయి.టైం లేదు.
దూకుడు పెంచమని చెప్పే చంద్రబాబు మాటలతో పెద్దగా ప్రయోజనం ఉండదంటున్నారు.ఇక సీనియర్ల అంశం తేల్చి యువతకు టికెట్లు కేటాయింటే దిశగా కూడా ముందడు వేస్తే మంచి జోష్ వస్తుందని అంటున్నారు.
చూడాలి మరి బాబుగారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో…
.