‘బాహుబలి-2’ 325 కోట్ల బిజినెస్‌

జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతున్న విషయం తెల్సిందే.

ఇప్పటికే 200 కోట్ల మార్క్‌ను దాటిన ఈ సినిమా మరిన్ని కలెక్షన్స్‌తో దూసుకు పోతూనే ఉంది.

రెండు పార్ట్‌లుగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి పార్ట్‌ విడుదల అయ్యింది.రెండవ పార్ట్‌ షూటింగ్‌ సగానికి పైగా పూర్తి అయ్యింది.ఈ క్రమంలో రెండవ పార్ట్‌ గురించిన ఆసక్తికర విషయాలను వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.‘బాహుబలి-2’ సినిమాను ఒక ప్రముఖ కార్పోరేట్‌ సంస్థ 325 కోట్లకు హోల్‌ సేల్‌గా కొనేందుకు ముందుకు వచ్చినట్లుగా వర్మ వెళ్లడించాడు.ఈ విషయాన్ని రామ్‌గోపాల్‌ వర్మ ట్విట్టర్‌లో చెప్పుకొచ్చాడు.

ఈ విషయం తెలిసి తాను షాక్‌ అయ్యాను అంటూ కూడా వర్మ ట్వీట్‌ చేశాడు.మొదటి పార్ట్‌కు వచ్చిన భారీ క్రేజ్‌ దృష్ట్యా రెండవ పార్ట్‌కు ఈ మొత్తం చెల్లించేందుకు ముందుకు వచ్చినట్లుగా చెబుతున్నారు.

ప్రభాస్‌ ఒక్క మొదటి పార్ట్‌కే షేర్ రూపంలో 65 కోట్లు పారితోషికంగా ప్రభాస్‌ తీసుకున్నాడు అని కూడా వర్మ ట్వీట్‌ చేశాడు.

Advertisement
కాశ్మీర్ వేర్పాటువాద జెండాలను అనుమతించొద్దు : రట్జర్స్ వర్సిటీకి ప్రవాస భారతీయ సంఘాల విజ్ఞప్తి

తాజా వార్తలు