ఆస్ట్రేలియా: ప్రభావం చూపని రెండు నెలల లాక్‌డౌన్.. మెల్‌బోర్న్‌లో ఏ మాత్రం తగ్గని కరోనా తీవ్రత

ఆస్ట్రేలియాలో కరోనాకు హాట్ స్పాట్‌గా వున్న నగరాల్లో మెల్‌బోర్న్ కూడా ఒకటి.

వైరస్ చైన్‌ను బ్రేక్ చేసేందుకు ప్రభుత్వం గడిచిన రెండు నెలలుగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది.

కానీ ఇది ఏ మాత్రం ప్రభావం చూపకపోగా.కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి.

గురువారం మెల్‌బోర్న్‌లో రికార్డు స్థాయిలో కేసులు వెలుగుచూశాయి.ఫుట్‌బాల్ ఫైనల్ మ్యాచ్‌ను చూసేందుకు ప్రజలు ఇళ్లలో భారీగా గుమిగూడటం వల్లే కేసులు పెరిగాయని అధికారులు అంటున్నారు.

ఆస్ట్రేలియన్ రూల్స్ ఫుట్‌బాల్ గ్రాండ్ ఫైనల్‌ని టీవీల ద్వారా చూసేందుకు మెల్‌బోర్న్‌ వాసులు గతవారం ఇళ్లలోనే పార్టీలు ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో ఎప్పుడూ లేని విధంగా 1438 కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.రాష్ట్రంలోని 5.5 మిలియన్ల వయోజనులకు టీకాలు వేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న వేళ తాజా కేసుల పెరుగుదల వారిని ఆందోళనకు గురిచేసింది.16 ఏళ్లకు పైబడిన వారిలో సగం మంది తమ మొదటి డోస్‌ను అందుకున్నారు.ఇది జాతీయ సగటు (53శాతం) కంటే తక్కువ.

Advertisement

ఆస్ట్రేలియాలోని అతిపెద్ద నగరాలైన సిడ్నీ, మెల్‌బోర్న్, కాన్‌బెర్రాలు డెల్టా వేరియంట్ కారణంగా థర్డ్ వేవ్‌ను ఎదుర్కొంటున్నాయి.ఈ నేపథ్యంలోనే వైరస్ మరింత తీవ్రం కాకుండా గడిచిన కొన్ని వారాలుగా ఈ నగరాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు.

లాక్‌డౌన్‌కు విరుగుడు వ్యాక్సినేషనే అని అధికారులు భావిస్తున్నారు.

గురువారం న్యూసౌత్‌వేల్స్‌లో 941 కొత్త కేసులు నమోదయ్యాయి.రాష్ట్ర రాజధాని సిడ్నీలో ఎక్కువగా.క్వీన్స్‌లాండ్‌లో ఆరు, ఆస్ట్రేలియన్ క్యాపిటల్ ప్రాంతంలో 31 కేసులు నమోదయ్యాయి.

వైరస్ బారినపడిన ఉద్యోగులను ఆదుకునేందుకు గాను లాక్‌డౌన్ వల్ల ప్రభావితమైన వ్యాపారులకు అత్యవసర ఆర్ధిక సహాయాన్ని నిలిపివేయాలని ఫెడరల్ ప్రభుత్వం గురువారం నిర్ణయించింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఫెడరల్ కోశాధికారి జోష్ ఫ్రైడెన్ బర్గ్ మాట్లాడుతూ 80 శాతం జనాభాకు పూర్తిగా టీకాలు వేసిన తర్వాత తాత్కాలిక చెల్లింపులు నిలిపివేయబడతాయని చెప్పారు.అయితే విక్టోరియా రాష్ట్రంలోని వ్యాపారులు మాత్రం వచ్చే ఆరు వారాల పాటు ఫెడరల్ ప్రభుత్వం నుంచి 2.27 బిలియన్ డాలర్ల మద్ధతు అందుకుంటారు.తాము వైరస్‌ను నిర్మూలించలేమని, కానీ కోవిడ్‌ నుంచి సురక్షితమైన మార్గంలో జీవించడం నేర్చుకోవాలని ఫ్రైడెన్‌బర్గ్ ఒక ప్రకటనలో తెలిపారు.80 శాతం వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత వైరస్‌తో సహజీవనం ప్రారంభించాలని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తున్నారు.ఆస్ట్రేలియాలో మొత్తం కేసులు 1,05,000కి చేరుకోగా.1291 మంది ప్రాణాలు కోల్పోయారు.అయితే ఈ గణాంకాలు ప్రపంచంలోని మిగిలిన దేశాల కంటే చాలా తక్కువ.

Advertisement

తాజా వార్తలు