కరోనా మహమ్మారి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే.కామాంధులకు మాత్రం కళ్ళు కనబడట్లేదు.
బాలిక సంరక్షణ చట్టాలు ఎన్ని ఉన్నా సరే అత్యాచారాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు.మహిళల సంరక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా ప్రయోజనం లేకుండా పోతుంది.
వివరాల్లోకి వెళితే పొలం చూడడానికి వెళ్లిన ఆ బాలిక (13) మళ్ళీ ఇంటికి చేరలేదు.కామాంధుల వికృత చేష్టలకు ఓ నిండు జీవితం బలైపోయింది.
కామాంధుల చేతిలో ఆమె జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది.చిత్రదుర్గం ఎస్పీ రాధిక అందించిన సమాచారం ప్రకారం.
భరమసాగర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గ్రామానికి చెందిన బాలిక శనివారం మధ్యాహ్నం ఒంటరిగా పొలం నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళుతుంది.
దారి మధ్యలో బాలికను కొందరు దుండగులు పట్టుకొని సమీప మొక్కజొన్న పొలంలోకి లాక్కొని వెళ్లినట్లు గుర్తించారు.
అక్కడ బాలికపై సామూహిక హత్యాచారం పాల్పడిన అత్యాచారానికి పాల్పడిన అనంతరం.ఆ బాలిక బయట ప్రపంచాన్ని చెబుతుందనే భయంతో ఆ బాలికను దుండగులను హతమార్చి పరారయ్యారు.ఆ బాలిక ఎంత ఎంతసేపటికీ ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు ఆందోళనతో పొలాల్లో గాలించారు.మొక్కజొన్న చేనులో విగతజీవిగా పడి ఉన్న ఆమె మృతదేహాన్ని చూసి ఊరంతా కన్నీరుమున్నీరైంది.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆదివారం రంగంలోకి దిగి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.పది ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి నిందితుడి కోసం వేట సాగిస్తామని ఎస్పీ వివరించారు.