ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు( Atchannaidu )….ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.గజదొంగే… దొంగ దొంగ అని అరుస్తున్నట్లు సజ్జల వ్యాఖ్యలు ఉన్నాయని ఎద్దేవా చేశారు.వైయస్ వివేకానంద రెడ్డి హత్యలో నిందితులెవరో తెలిసాక కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు.
వివేక హంతకులు ఎవరో మీడియా… చెబుతుంటే సహించలేని సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షిలో వివేకానంద రెడ్డి పై వచ్చిన కథనాలు సంతృప్తి కలిగించాయా అంటూ అచ్చెన్నాయుడు ప్రశ్నించడం జరిగింది.
వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో మొదట చంద్రబాబుపై ఆ తర్వాత సునీత రెడ్డి( Sunita Reddy ) పై అంటగట్టే ప్రయత్నాలు చేసి ఇప్పుడు ఏకంగా వైయస్ వివేకానంద రెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బ కొట్టే రీతిలో కథనాలు అల్లుతున్నారని మండిపడ్డారు.ఇక క్లైమాక్స్ వచ్చేసరికి ఏకంగా దర్యాప్తు సంస్థ సీబీఐ పనితీరును తప్పుపడుతున్నారని అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.ఆఖరికి సీబీఐ ఎలా దర్యాప్తు చేయాలో కూడా సజ్జలా చెబుతారా అంటూ ప్రశ్నించారు.
ఎవరు ఎన్ని డ్రామాలు ఆడిన వివేక హత్య కేసులో నిందితులు తప్పించుకోలేరని అచ్చెన్నాయుడు… పేర్కొన్నారు.