ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ( Ashwini Dutt )గురించి మనందరికీ తెలిసిందే.ఈయన తరచూ వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు గుర్తిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.
ముఖ్యంగా ఎప్పటికప్పుడు జగన్( jagan ) పై విమర్శలు గుప్పిస్తూ నీతులు చెబుతూ ఉంటారు.ఇది ఇలా ఉంటే తాజాగా అశ్విని దత్ చంద్రబాబు అరెస్టు కావడంతో జగన్ ని వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఘాటుగా విమర్శలు చేశారు.
చంద్రబాబు నాయుడు లాంటి గొప్ప మహానీయుడు.అలాంటి వ్యక్తిని అరెస్టు చేయడం దుర్మార్గం అంటూ ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ వీడియోలో అశ్వని దత్ మాట్లాడుతూ.దేశానికి గొప్ప ప్రధానిని, స్పీకర్‌ను, రాష్ట్రపతిని ఇచ్చిన ఘనత చంద్రబాబుది.అలాంటి నేతను దర్మార్గంగా అరెస్ట్ చేశారు.ఆ మహానీయుడుని అరెస్ట్‌కు కుట్ర పన్నిన వారికి పుట్టగతులు ఉండవు అంటూ శాపనార్థాలు పెట్టారు.వచ్చే ఎన్నికల్లో టీడీపీ పార్టీ 160 సీట్లు గెలుస్తుందని జ్యోషం కూడా చెప్పారు.
తమ సామాజిక వర్గ నేత అధికారంలో లేడని బాధ ఆయనలో నిత్యం కనపడుతూనే ఉంటుంది.
అందులో కొత్త లేకపోయిన టీడీపీ( TDP ) పార్టీకి 160 సీట్లు వస్తాయనుకున్నప్పుడు నోటాతో పోటీపడే బీజేపీ, రెండు చోట్ల నిలబడి ఓడిపోయిన జనసేన పవన్ కళ్యాణ్ చుట్టూ టీడీపీ ఎందుకు తిరుగుతుందని సెటైర్లు వేస్తున్నారు వైసీపీ నేతలు.మరోవైపు చంద్రబాబు అరెస్ట్‌పై టాలీవుడ్ నుండి పెద్దగా స్పందన లేకపోయిన చంద్రబాబు ద్వారా లబ్ధిపొందిన ఆయన సామాజిక వర్గ డైరెక్టర్లు, నిర్మాతలు కొంత మంది అరెస్ట్‌ను ఖండిస్తున్నారు.