భారతదేశంలో అధికారికంగా ZenBook 17 Fold OLED ల్యాప్‌టాప్‌ను Asus తీసుకొచ్చింది.ఇది ప్రపంచంలోనే మొదటి 17.3-అంగుళాల ఫోల్డబుల్ ల్యాప్‌టాప్ అని చెప్పొచ్చు.భారతదేశంలో దీని ధర రూ.3,29,990గా నిర్ణయించబడింది.ల్యాప్‌టాప్ ఆసుస్ ఇ-షాప్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్, తర ఆసుస్-అధీకృత స్టోర్‌ల ద్వారా అందుబాటులో ఉంది.
ఇది ఇంటెల్, BOEతో అభివృద్ధి చేయబడింది.ఇది డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ వాడుతున్న అనుభవాన్ని ఇస్తుంది.

ఆసుస్ జెన్ బుక్ 17 ఫోల్డ్ OLED ల్యాప్‌టాప్ 12వ Gen ఇంటెల్ కోర్ i7-1250U CPUని కలిగి ఉంది.దీని మిగిలిన స్పెసిఫికేషన్స్ కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.16 జీబీ ర్యామ్, 1 టీబీ హార్డ్ డిస్క్ ఉంటుంది.ఈ ఫోల్డబుల్ ల్యాప్‌టాప్‌లో ఇంటెల్ యొక్క ఐరిస్ Xe గ్రాఫిక్స్ అదనంగా ఉన్నాయి.
కాబట్టి ప్రత్యేకమైన GPU లేదు.ఇది థండర్ బోల్ట్ 4, వైఫై 6ఈని కూడా కలిగి ఉంది.17.3-అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను 2.5కే రిజల్యూషన్‌తో మరియు విప్పినప్పుడు 350 నిట్‌ల గరిష్ట ప్రకాశంతో తయారు చేశారు.నోట్‌బుక్‌ను మడతపెట్టి కూడా ఉపయోగించవచ్చు.1080p రిజల్యూషన్‌తో రెండు 12.5-అంగుళాల స్క్రీన్‌లను అందిస్తుంది.స్క్రీన్ టచ్ సపోర్ట్, యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్‌ను అందిస్తుంది.ఇది డాల్బీ అట్మోస్ ఆడియోతో హర్మాన్ కార్డాన్ క్వాడ్ స్పీకర్లను కలిగి ఉంది.జెన్‌బుక్ 17 ఫోల్డ్ OLEDలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ వెబ్‌క్యామ్‌ను కూడా కలిగి ఉంది.ఆసుస్ కొత్త ఫోల్డబుల్ ల్యాప్‌టాప్ బరువు 1.5 కిలోలు, ఎర్గోసెన్స్ కీబోర్డ్ అటాచ్‌మెంట్ బరువు 1.8 కిలోల వరకు ఉంటుంది.దీనికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుందని కంపెనీ భావిస్తోంది.