ఎలాన్ మస్క్ ట్విట్టర్ ని కొనుగోలు చేసిన నాటినుండి షాకుల మీద షాకులు ఇస్తున్నాడు.అవును, ఇకనుండి ట్విట్టర్ కేవలం మెసేజ్ లు, వీడియోలు, టెక్స్ట్ మెసేజ్ లు పంపించుకోడానికి మాత్రమే కాదు, ఇకపై డబ్బులు కూడా పంపుకోడానికి ఉపయోగ పడనుంది.అవును… వాట్సప్ పే లాగే, ట్విట్టర్ కూడా పేమెంట్ల రంగంలోకి తాజాగా అడుగుపెట్టింది.ఇకనుండి గూగుల్ పే, ఫోన్ పే బదులు ట్విట్టర్ పే వాడబోతున్నారు.
యూజర్ల ఫోన్ లో ఇకనుండి ట్విట్టర్ ట్రాన్సాక్షన్స్ జరగనున్నాయి.
ఎలాన్ మస్క్ పెద్ద మాస్టర్ ప్లాన్ వేశాడు.
ట్విట్టర్ ని సాధారణ మెసేజింగ్ యాప్ లాగా కాకుండా ఆదాయ వనరుగా మార్చనున్నాడు.ఈ క్రమంలోనే బ్లూటిక్, అఫిషియల్ లేబుల్ అంటూ సబ్ స్క్రిప్షన్ చార్జీలు వసూలు చేస్తున్న సంగతి విదితమే.
కాగా ఇప్పుడు ఆన్ లైన్ పేమెంట్ల వైపు మొగ్గు చూపడం విశేషం.గతవారం అమెరికా యంత్రాంగం వద్ద దీనికి సంబంధించిన పేపర్ వర్క్ అంతా పూర్తి చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
డిజిటల్ పేమెంట్లపై అడ్వర్టెజర్లతో ఎలాన్ మస్క్ సమావేశం అయినట్టు భోగట్టా.

ఈ నేపథ్యంలో యూజర్లు సాధారణ బ్యాంక్ అకౌంట్లతోపాటు ట్విట్టర్లో కూడా డబ్బులు నిల్వ చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు.మిగతా బ్యాంక్ అకౌంట్లకంటే ట్విట్టర్ అకౌంట్లో నిల్వ చేసుకునే సొమ్ముపై అధిక వడ్డీ ఇచ్చే ఆలోచనలో కూడా వున్నారని వినికిడి.అయితే గూగుల్ పే, ఫోన్ పే లాగా.ఇది ఫేమస్ అవుతుందో లేదో చూడాలి మరి.ఇప్పటికే సగం మంది ఉద్యోగుల్ని పీకేసిన మస్క్, ఇప్పుడు ఉన్నవారిపై ఒత్తిడి పెంచబోతున్నాడు.వర్క్ ఫ్రమ్ హోమ్ వద్దని తేల్చి చెప్పి, ఏ ఉద్యోగి అయినా సరే వారానికి 40గంటలు ఆఫీస్ కి రావాల్సిందేనని షరతులు పెట్టాడు.







