అమిత్‌ షాపై ఓవైసీ తీవ్ర వ్యాఖ్యలు, రికార్డుల నుండి తొలగింపు

పార్లమెంటులో నేడు పౌరసత్వ సవరణ బిల్లును అమిత్‌ షా ప్రవేశ పెట్టిన విషయం తెల్సిందే.ఆ బిల్లును పలు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

టీఆర్‌ఎస్‌తో పాటు ఎంఐఎం కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లుగా ప్రకటించింది.ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ మాట్లాడుతూ అమిత్‌ షాపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశాడు.

ఇలాంటి బిల్లు నుండి దేశంను కాపాడాలంటూ ఈ సందర్బంగా ఎంపీ ఓవైసీ అన్నారు.ఓవైసీ ఇంకా మాట్లాడుతూ.

దేశంను అమిత్‌ షాను కాపాడాలని.లేకపోతే ఆయన హిట్లర్‌, డేవిడ్‌ బెన్‌ గురియన్‌ల వంటి నేతల సరసన చేరడం ఖాయం అని, ఆయన వల్ల మన దేశంలో తీవ్రమైన అసమానతలు పెరుగుతాయంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

Advertisement

ఓవైసీ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో లోక్‌ సభలో బీజేపీ ఎంపీలు విరుచుకు పడ్డారు.అమిత్‌ షాను హిట్లర్‌తో పోల్చడం ఏంటంటూ ఓవైసీపై మండి పడ్డాడు.

దాంతో స్పీకర్‌ ఓమ్‌ బిర్లా స్పందిస్తూ ఓవైసీ వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగిస్తున్నట్లుగా ప్రకటించాడు.

Advertisement

తాజా వార్తలు