సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు పెరిగిపోతున్నారు.సాధారణ ప్రజలనే కాదు పోలీసులను సైతం టార్గెట్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ ఫేస్ బుక్ అకౌంట్ ను హ్యాక్ చేశారు.
అకౌంట్ ను హ్యాక్ చేసిన అనంతరం సైబర్ కేటుగాళ్లు బ్లూ ఫిల్మ్ ను అప్ లోడ్ చేశారని తెలుస్తోంది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సైబర్ కేటుగాళ్ల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.