మహేష్ బాబు ముందు బీర్ తాగినప్పుడు అంటూ సీక్రెట్ బయటపెట్టిన హీరో?

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడిగా, ఒకవైపు పొలిటికల్ సపోర్ట్, మరొకవైపు ఘట్టమనేని ఫ్యామిలీ సపోర్ట్ ద్వారా తన అదృష్టాన్ని మొదటిసారి పరీక్షించుకో బోతున్నాడు హీరో అశోక్ గల్లా.టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరో గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

అశోక్ గల్లా తాజాగా హీరోగా నటించిన చిత్రం హీరో.ఈ సినిమాలో అశోక్ గల్లా సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.

ఇక అశోక్ గల్లా హీరో గా నటించిన హీరో సినిమా జనవరి 14న సంక్రాంతి పండుగకు విడుదల కానుంది.ఇక ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పలు రకాల అంశాలను ప్రమోషన్స్ లో భాగంగా హైలెట్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే అశోక్ గల్లా తన ఫ్యామిలీకి సంబంధించిన పర్సనల్ విషయాలను ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.తాజాగా ఇంటర్వ్యూలో అశోక్ గల్లా మాట్లాడుతూ.

Advertisement

అశోక్ తన మామ మహేష్ బాబు తో కూర్చుని బీరు కూడా తాగినట్టు తెలిపాడు.తనకు 18 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఒకసారి ఇంట్లోనే మహేష్ పక్కన ఉండగానే బీరు తీసుకొని తాగాను అని చెప్పుకొచ్చాడు అశోక్.

ఆ సమయంలో మహేష్, అశోక్ ని ఒక డిఫరెంట్ లుక్ తో చూశాడట.

అంతేకాకుండా బీర్ తాగుతావా అని మహేష్ అడిగినప్పుడు అశోక్ ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయాడట.ఇక ఇంటర్వ్యూలో అశోక్ మాట్లాడిన మాటలను బట్టి చూస్తే అశోక్ తన మామయ్య మహేష్ బాబు తో చాలా క్లోజ్ గా ఉంటాడు అని అర్థం అవుతోంది.అంతేకాకుండా మహేష్ బాబు ఇంట్లో చాలా కూల్ గా ఉంటూ, అల్లరి అల్లరి చేస్తూ పిల్లలతో బాగా కలిసి పోతూ ఉంటారు అని చెప్పుకొచ్చాడు అశోక్.

తనకు తెలిసినంతవరకూ తన జీవితంలో మహేష్ బాబు లాంటి వ్యక్తిని చూడలేదు అని అశోక్ వెల్లడించారు.అశోక్ నటించిన హీరో సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా, కృష్ణ గల్లా అరుణ కుమారి సమర్పణలో గల్లా పద్మావతి ఈ సినిమాను నిర్మించారు.

ఎన్టీఆర్ నాకన్నా చిన్నోడు... నన్ను మాత్రం ఒరేయ్ అని పిలుస్తాడు : రాజీవ్ కనకాల 
జాక్ మూవీ సెన్సార్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?

ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15న థియేటర్లలో విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు