అసాని తుఫాను ఒక ప్రజా నాయకుడు ని బలితీసుకుంది

ఆసాని తుఫాను అనకాపల్లి జిల్లాలో ఓ ప్రజాప్రతినిధి ప్రాణాన్ని బలితీసుకుంది.

బైక్ పై వస్తున్న ఎంపీటీసీ కాసులు మీద కొబ్బరి చెట్టు పడడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు అసాని తుఫాన్ కారణంగా ఉత్తరాంధ్రలో పలుచోట్ల ఈదురు గాలులు భారీ వర్షాలు కురిశాయి అదే రీతిన అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం లో కూడా ఈదురుగాలులు బుధవారం వీచాయి.

ఆ సమయంలో ఎస్ రాయవరం మండలం ఉప్పరపల్లి ఎంపీటీసీ తుమ్మపాల కాసులు బైక్ పై గ్రామానికి వస్తున్నారు రోడ్డు పక్కన ఉన్న చెట్లు ఈదురుగాలులకు ఊగిసలాడే ఆ సమయంలో ఓ కొబ్బరి చెట్టు బైక్పై వెళ్తున్న కాసుల మీద పడింది దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందారు.వైఎస్ఆర్ సీపీకి చెందిన కాసులు ఈ ప్రాంత వాసులకు సుపరిచితులు ఊహించని రీతిలో అతను మృత్యువాత పడడంతో ఎస్ రాయవరం మండలం లో విషాద ఛాయలు నెలకొన్నాయి.

పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.

Advertisement

Latest Vizag News