స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.ఈ కేసులో ఇవాళ్టితో రిమాండ్ ముగియనున్న నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టు ఆన్ లైన్ విధానంలో విచారణ చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి, చంద్రబాబు మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది.ఈ నేపథ్యంలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ వయసులో తనకు పెద్ద పనష్మెంట్ ఇచ్చారన్నారు.
తన మీద ఉన్నవి ఆరోపణలు మాత్రమేనన్న చంద్రబాబు అవి నిర్ధారణ కాలేదని చెప్పారు.తప్పు ఉంటే విచారణ చేసి అరెస్ట్ చేయాల్సిందని పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఇది ట్రైల్ కాదని, అర్థం చేసుకోవాలని సూచించారు.కోర్టుకి ఒక విధానం ఉంటుందని, వాటిని ఎవరూ మార్చలేరని చెప్పారు.
కోర్టు దాని పరిధిలో పని చేస్తోందన్నారు.అనంరతం మీరు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారన్న న్యాయమూర్తి ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పాలని వెల్లడించారు.
.






