ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు( Women Reservation Bill ) పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందింది.బిల్లు ఆమోదంతో చట్ట సమభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్స్ అమల్లోకి రానున్నాయి.
దాంతో 545 లోక్ సభ స్థానాలకు గాను కేవలం మహిళల కోసమే 179 స్థానాలు కేటాయించాల్సి ఉంటుంది.అటు రాష్ట్రాల కూడా సీట్ల ఆధారంగా మహిళల కోసం కేటాయింపు జరపాల్సి ఉంటుంది.అయితే మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించినప్పటికి చట్టంగా చేయడంలో మాత్రం మోడి సర్కార్ హోల్డ్ లో ఉంచింది.
2024 ఎన్నికల తరువాత జనగణన, డీలిమిటేషన్ తరువాత మహిళా రిజర్వేషన్ అమలు చేస్తామని మోడి సర్కార్ ( Modi Govt )చెప్పడంతో కొత్త కొత్త తెరపైకి వస్తున్నాయి.డీలిమిటేషన్ ప్రక్రియకు( Delimitation ) మహిళా రిజర్వేషన్ చట్టం రూపకల్పనకు సంబంధం ఏముందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.పంచాయతి, మున్సిపల్ సంస్థలలో రిజర్వేషన్ కపించినప్పుడు.జనగణన, డీలిమిటీషన్ వంటి వాటితో సంబంధం లేదనేది కొందరు చెబుతున్నా మాట.

ఇదే మాటను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే( Mallikarjuna Kharge ) ప్రస్తావించారు.దాంతో మహిళా రిజర్వేషన్ ప్రక్రియను హోల్డ్ లో ఉంచడానికి ఇంకా ఏదో రీజన్ ఉందనేది ప్రస్తుతం జాతీయ రాజకీయ చర్చనీయంగా మారిన అంశం.అయితే బిజెపి( BJP ) ఆల్రెడీ ఎన్నికలకు తగిన ప్రణాళికలను సిద్దం చేసుకుందని, ఇప్పుడు మహిళా రిజర్వేషన్ ప్రక్రియ మొదలు పెడితే ప్రణాళికల్లో మార్పులు చేయాల్సి రావడం వల్లే మోడి సర్కార్ వెనుకడుగు వేస్తోందనేది కొందరి వాదన.

మొత్తానికి బిల్లు ఆమోదం పొందినప్పటికి మహిళా రిజర్వేషన్ ప్రక్రియపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బిల్లు ను సక్సస్ చేశామని చెప్పేందుకు ఇదే అంశాన్ని ప్రచారం కోసం వాడుకునేందుకే మోడి సర్కార్ మహిళా బిల్లు కోసం పార్లమెంట్ సమావేశాలు నిర్వహించిందనేది కొందరి వాదన.మరి ఈ ప్రశ్నలన్నిటికి మోడి సర్కార్ ఎలా వివరణ ఇస్తుందో చూడాలి.







