భారత సంతతి మంత్రిపై అవినీతి ఆరోపణల కేసు.. సింగపూర్ బిలియనీర్‌కు నోటీసులు

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగపూర్‌( Singapore )కు చెందిన భారత సంతతి మంత్రి ఈశ్వరన్‌కు షాక్ తగిలింది.

సింగపూర్‌కు ఫార్ములా వన్ రేసులను తీసుకురావడంలో ప్రఖ్యాతి గాంచిన ప్రాపర్టీ టైకూన్.

ఈ అవినీతి కేసు దర్యాప్తులో యాంటీ గ్రాఫ్ట్ ఏజెన్సీకి సహకరిస్తున్నట్లు శుక్రవారం తెలిపింది.సింగపూర్ లిస్టెట్ హోటల్ ప్రాపర్టీస్ లిమిటెడ్ సంస్థ ఈ కేసులో తమ ఎండీ ఓంగ్ బెంగ్ సెంగ్‌పై ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదని ఒక ప్రకటనలో పేర్కొంది.

రవాణా శాఖ మంత్రి ఈశ్వరన్‌తో( S Iswaran ) ఆయన జరిపిన పరస్పర చర్యలపై సమాచారం అందించాల్సిందిగా కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సీపీఐబీ) ఓంగ్‌ను కోరింది.ప్రస్తుతం విదేశాల్లో వున్న ఓంగ్.

సింగపూర్‌కు రాగానే తన పాస్‌పోర్ట్‌ను సీపీఐబీకి సరెండర్ చేస్తారని కంపెనీ ప్రకటించింది.ఆయనకు అరెస్ట్ నోటీసు కూడా ఇచ్చినట్లు పేర్కొంది.

Advertisement

లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ Refinitiv Eikon ప్రకారం.79 ఏళ్ల హోటల్ ప్రాపర్టీస్ లిమిటెడ్ సంస్థ కోమో, ఫోర్ సీజన్స్, హార్డ్ రాక్ హోటల్స్, కాంకోర్డ్ వంటి బ్రాండ్ల కింద 38 హోటళ్లు, రిసార్ట్‌లను కలిగి వుంది.ఈ వార్తల నేపథ్యంలో హోటల్ ప్రాపర్టీస్ లిమిటెడ్‌ షేర్లు 7 శాతం వరకు పడిపోయి, 4.4 శాతం క్షీణించాయి.మలేషియాలో జన్మించిన ఓంగ్ 2008లో ఫార్ములా వన్ మోటార్ రేసింగ్‌ను సింగపూర్‌కు తీసుకువచ్చిన ఘనత సాధించాడు.ఫోర్బ్స్ ప్రకారం ఓంగ్, ఆయన భార్య క్రిస్టినాలు 2022లో 1.75 బిలియన్ డాలర్ల నికర సంపదను కలిగివున్నారు.

కాగా.సీపీఐబీ( CPIB ) ఈ వారం ప్రారంభంలో ఈశ్వరన్‌పై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపింది.దీనికి సంబంధించిన తదుపరి వివరాలను మాత్రం ఏజెన్సీ వెల్లడించలేదు.

ఇది సింగపూర్‌లో అరుదైన అత్యున్నత స్థాయి విచారణ.అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈశ్వరన్‌ను సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశించారు సింగపూర్ ప్రధాన మంత్రి లీ సీన్ లూంగ్.

ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.రవాణా శాఖ మంత్రి ఈశ్వరన్‌తో పాటు ఇతర వ్యక్తులను సీపీఐబీ విచారించాల్సి వుంటుందని ప్రధాని ప్రత్యేక ప్రకటనలో తెలిపారు.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఈ క్రమంలో విచారణ పూర్తయ్యే వరకు సెలవు తీసుకోవాలని ఈశ్వరన్‌ను ఆదేశించారు లీ.ఆయన విధులకు దూరంగా వుంటున్న నేపథ్యంలో సీనియర్ మంత్రి చీ హాంగ్ టాట్ రవాణా శాఖ తాత్కాలిక మంత్రిగా వ్యవహరిస్తారని ఛానెల్ న్యూస్ ఏషియా నివేదించింది.స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సింగపూర్‌ను పాలిస్తున్న పీపుల్స్ యాక్షన్ పార్టీలో (పీఏపీ) ఈశ్వరన్ పార్లమెంట్ సభ్యుడు.ఆయన 1997లో తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు.2006లో ఈశ్వరన్ మంత్రిగా నియమితులయ్యారు.రవాణా మంత్రిగా, కోవిడ్ సంక్షోభం తర్వాత సింగపూర్‌ను ఎయిర్ హబ్‌గా తీర్చిదిద్దడంలో ఈశ్వరన్ కీలకపాత్ర పోషించారు.

Advertisement

అలాగే సింగపూర్ వాణిజ్య సంబంధాల ఇన్‌ఛార్జ్‌ మంత్రిగానూ వ్యవహరిస్తున్నారు.

తాజా వార్తలు