మీరు గర్భవతిగా ఉండి ఆఫీసుకు వెళ్తున్నారా.. అయితే ఇది మీకోసమే..?

ఈ భూమి మీద ఉన్న ప్రతి వివాహమైన మహిళ తల్లిగా మారడానికి కలలు కంటూ ఉంటుంది.

ఎందుకంటే తల్లిగా మారడం అనేది నిజంగానే ఒక వరం అని చెప్పవచ్చు.

గర్భవతిగా ( pregnant )ఉన్నప్పుడు ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.లేదంటే గర్భం నిలబడడం కష్టమవుతుంది.

పూర్వకాలంలో అయితే గర్భవతులుగా ఉన్న మహిళలు( women ) ఇంటి పని చేసుకుని, సమయం దొరికినప్పుడు నచ్చినవి తింటూ సరదాగా చిన్న ఆటలు ఆడుకుంటూ సమయాన్ని సంతోషంగా గడిపేవారు.కానీ ప్రస్తుత సమాజంలో జీవితంలో పరిగెత్తాల్సి వస్తుంది.

దీంతో గర్భిణీలు కూడా ఆఫీసుకు వెళ్తున్నారు.అయితే ప్రెగ్నెన్సీలో మానసికంగా, శరీరకంగా అనేక మార్పులు వస్తూ ఉంటాయి.

Advertisement

ఈ సమయంలో మహిళలలో అనేక మూడు స్వింగ్స్ ఉంటాయి.కోపం, నీరసం, అలసట, చిరాకు వంటివి కలుగుతాయి.కానీ కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.

గర్భంతో ఉన్న మహిళలు ఆఫీసుకు వెళ్లి పని చేయాల్సి ఉంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.ఆ జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఆఫీసులకు వెళ్లే మహిళలు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.

ముఖ్యంగా మీ భోజనం ఆకుకూరలు, కూరగాయలు వంటివి ఉండాలి.అలాగే ఫోలిక్ యాసిడ్స్ ( Folic Acids )వంటి ఫుడ్స్ కూడా ఉండేలా జాగ్రత్త పడాలి.

మజ్జిగ లేదా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ లు తీసుకోవడం మంచిది.అలాగే నీరు త్రాగుతూ ఉండాలి.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

సాధారణంగా ప్రెగ్నెన్సీ లో ఫుడ్ క్రేవింగ్ ఉంటాయి.కొన్ని రకాల ఆహారాలను ఇష్టంగా తింటూ ఉంటారు.కానీ పనిలో ఉన్నప్పుడు వీలైనంతవరకు జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి.

Advertisement

ఎందుకంటే వీటి వల్ల అనారోగ్య సమస్యలు( Health problems ) పెరిగే అవకాశం ఉంది.అలాగే కడుపులో తిప్పడం, వాంతులు అవడం వంటివి జరుగుతూ ఉంటాయి.తినాలనిపిస్తే ఏదో కొంచెం తిని సరిపెట్టుకోవడమే మంచిదని చెబుతున్నారు.

అలాగే మీరు ఆఫీసులో కూర్చుని పని చేస్తూ ఉంటే మాత్రం గంట లేదా గంటన్నర సమయం తర్వాత మధ్య మధ్యలో చిన్న విరామం తీసుకుంటూ ఉండడం మంచిది.అలాగే ఇలాంటి సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

అలాగే పని ఒత్తిడికి కాస్త దూరంగా ఉండడమే గర్భావతులకు మంచిది.

తాజా వార్తలు