పిల్లలతో తిరుమల వెళ్తున్నారా.. అయితే టీటీడీ తాజా ఆంక్షలు ఇవే..!

తిరుమల( Tirumala ) శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతా విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం అమలు చేస్తుంది.

తాజాగా చిరుత దాడిలో బాలిక మృతి చెందడంతో నడక మార్గంలో టీటీడీ రక్షణ చర్యలు మొదలుపెట్టింది.

నడకల మార్గంలో భక్తుల అనుమతి పైన కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.సాయంత్రం ఆరు తర్వాత ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించింది.

తాజాగా పిల్లలను నడక మార్గంలో తీసుకెళ్లడం పైన ఆంక్షలు విధించింది.ఇప్పటికే అధికారులతో వరుస చర్చలు చేసిన చైర్మన్ కరుణాకర్ రెడ్డి,( Bhumana Karunakar Reddy ) ఈవో ధర్మారెడ్డి ( TTD EO Dharmareddy )కీలక నిర్ణయాలు వెల్లడించారు.

చిన్న పిల్లలతో నడక మార్గంలో తిరుమలకు వచ్చే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని చైర్మన్ కోరారు.ఇదే సమయంలో ప్రత్యేకంగా పిల్లల విషయంలో టిటిడి తాజాగా కొన్ని కీలక నిర్ణయాల అమలుతో పాటు ఆంక్షలు కూడా ప్రకటించింది.నడక మార్గంలో పిల్లల విషయంలో ప్రత్యేక చర్యలను మొదలుపెట్టింది.

Advertisement

మధ్యాహ్నం రెండు గంటల తర్వాత 15 సంవత్సరాలలోపు పిల్లలకు అనుమతి నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.అలాగే చిన్న పిల్లల చేతికి ఇవాళ పోలీస్ సిబ్బంది ట్యాగులు వేస్తున్నారు.

తల్లిదండ్రుల నుంచి పిల్లలు తప్పిపోతే కనిపెట్టేందుకు ట్యాగులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.ట్యాగు పై పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నెంబర్, పోలీస్ టోల్ ఫ్రీ నెంబర్ లను పొందుపరుస్తున్నారు.

కానీ నడకన వచ్చే భక్తులు వంద గాలిగోపురం నుంచి నరసింహ స్వామి ఆలయం వరకు గుంపులు గుంపులుగా భక్తులను అనుమతిస్తున్నారు.ముందు వెనుక రోప్ ఏర్పాటు చేసి భద్రత సిబ్బంది సహాయంతో పంపుతున్నారు.కాలిబాట మార్గంలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని టీటీడీ ఈవో వెల్లడించారు.

ఇంకా చెప్పాలంటే సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు.అలాగే నడక దారిలో ఇప్పటికే 30 మంది టీటీడీ భద్రత( TTD security ) సిబ్బంది, పదిమంది ఫారెస్ట్ సిబ్బంది ఉన్నట్లు వెల్లడించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్15, ఆదివారం2024
Advertisement

తాజా వార్తలు