ఆ మీటింగ్స్ వర్కవుట్ అవుతున్నాయా ? బీజేపీ ప్లాన్ సక్సెస్ అయ్యిందా ?

తెలంగాణ బిజెపిలో సందడి వాతావరణం నెలకొంది.

రాబోయే ఎన్నికల్లో బిజెపిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర బిజెపి పెద్దల సూచనలతో తెలంగాణలో బిజెపి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహిస్తోంది.

భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పార్టీలోని రాష్ట్ర స్థాయి నేతలతో పాటు, కిందిస్థాయి కార్యకర్తలు వరకు అంత పాల్గొనే విధంగా రూపకల్పన చేశారు ఈ స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్స్ పార్టీ పరంగా కొన్ని రకాల నియమ నిబంధనలు విధించారు.అంతేకాదు ఈ మీటింగ్స్ ను తూతూ మంత్రంగా నిర్వహించకుండా ,ఎక్కడికక్కడ నిఘాను ఏర్పాటు చేశారు.

బిజెపి స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్ కు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండడంతో బిజెపిలో మరింత ఉత్సాహం కనిపిస్తుంది.ముందు ముందు పార్టీ శ్రేణులు అంతా ఉత్సాహంగా పనిచేసేందుకు ఈ సభలు మరింత దోహదం చేస్తున్నాయి.

ఇప్పటికే 12 మంది ప్రత్యేక బృందంతో కూడిన కమిటీ ఎప్పటికప్పుడు నాయకులను సమన్వయం చేస్తూ ,సభలను సక్సెస్ చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

Advertisement

ఇప్పటికే తెలంగాణలో 11వేల సభలను నిర్వహించాలని టార్గెట్ ను బిజెపి పెట్టుకుంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి కనీసం 100 సభలను నిర్వహించాలని టార్గెట్ పెట్టుకుంది.దీనిలో భాగంగానే గజ్వేల్ నియోజకవర్గం లో మొత్తం 88 సభలు చేపట్టాలని ప్లాన్ చేసుకోగా, మంగళవారం నాటికి 45 సభలు పూర్తయ్యాయి.

సిద్దిపేట నియోజకవర్గంలో 70 సభలను నిర్వహించాలని టార్గెట్ పెట్టుకోగా 36 పూర్తి అయ్యాయి.

అలాగే సిరిసిల్ల నియోజకవర్గంలో 108 సభలను నిర్వహించాలని టార్గెట్ పెట్టుకోగా, ఇప్పటికే 52 పూర్తి చేశారు.ఈనెల 25వ తేదీ లోపు దాదాపు టార్గెట్ పెట్టుకున్న అన్నిటిని పూర్తి చేయాలని లక్ష్యంతో తెలంగాణ బిజెపి నాయకులు ఉన్నారు.వీరికి ఎప్పటికప్పుడు బిజెపి కేంద్ర పెద్దల నుంచి సలహాలు, సూచనలు అందుతూనే ఉన్నాయి.

ఇదే ఉత్సాహంతో ఎన్నికలవరకు పార్టీ నాయకులంతా పని చేసే విధంగా బీజేపీ పనిచేస్తోంది.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు