టిడిపి నేత కొనకళ్ళ నారాయణరావు హౌస్ అరెస్ట్ కొనకళ్ళ నారాయణరావు కామెంట్స్.గన్నవరంలో వైసిపి రౌడీ మూకలు నియోజవర్గ కార్యాలయంలో చొరబడి చేసిన విధ్వంసంలో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలమీద నాన్ బెయిల్ కేసులు సొంత బాబాయ్ హత్య కేసులో రాష్ట్ర పోలీసు వారు నిజాలు తీర్చలేక పోయారు గాని సిబిఐ ద్వారా రోజు రోజుకు నిజాలు బయటకు వస్తున్నాయి.
ఈ రోజు తెలుగుదేశం పార్టీ వారిపైన అక్రమ కేసులు పెడతానికి నాన్ బెల్ కేసులు పెడతానికి రాష్ట్ర పోలీస్ వారు ముందుకు వస్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించిన వారి పైన కేసులు పెట్టడం వల్ల కాక ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసు పెట్టడం పోలీస్ వారి పక్షపాత ధోరణికి నిదర్శనం సీఐ కనకరాజు తలకు గాయాలు అవడానికి కారణమైన వారు ఎవ్వరో ప్రపంచానికి మొత్తానికి తెలుసని, గంటన్నర సిసి టివి ఫుటేజ్ ఉందని వాటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలి ఎస్పీ సుమోటో కేసుగా బుక్ చేసి చర్యలు తీసుకుంటున్నాము అని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని, రాత్రి నేను 5 ఫిర్యాదులు ఇచ్చి రసీదు తీసుకోవడానికి నాకు గంటన్నర టైం పట్టిందని పోలీసు వ్యవస్థ ఇంత దారుణంగా మారిందని ఇప్పటి నుండి అయినా పోలీసులు నిష్పక్ష పాతంగా వ్యవహరించి న్యాయం చేయాలని ఆయన అన్నారు.