జగన్ హామీలే టార్గెట్ గా బాబు వ్యూహాలు ? 

ఏపీలో త్వరలోనే ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయి అనే హడావుడి చాలాకాలం నుంచి జరుగుతూనే ఉంది.ముందస్తు ఎన్నికలు వచ్చినా , రాకపోయినా, సాధారణ ఎన్నికలకు కూడా ఏడాది లోపు మాత్రమే సమయం ఉండడంతో,  అధికార పార్టీ వైసీపీ( YCP ) జనాలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది.2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నిటిని 98 శాతం పూర్తి చేశామని చెప్తూనే,  ఆ మిగిలిన 2 శాతం హామీలను నెరవేర్చుకునే పనిలో నిమగ్నం అయ్యింది.దీనిలో భాగంగానే తాజాగా క్యాబినెట్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలను ఆమోదించింది.

 Are Jagan's Promises The Target Of Babu's Strategies? Jagan, Ysrcp, Ap, Tdp, Ap-TeluguStop.com

దీనిలో ప్రధానంగా సీపీఎస్ ను రద్దు చేసి జీపిఎస్ ను తీసుకువచ్చారు.

Telugu Ap Cm Jagan, Ap, Jagan, Tdp Menifesto, Telugudesam, Ysrcp, Ysrcp Menifest

అలాగే హెచ్ఆర్ఏ పెంపు, కాంట్రాక్ట్ ఉద్యోగులతో జరిపిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలో డీఏ, పీఆర్సీ బకాయిల చెల్లింపు కోసం 2027 ను డెడ్ లైన్ గా పెట్టారు.ఈ విధంగా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అన్నిటిని నెరవేర్చుకున్నాము అంటూ వైసీపీ గొప్పలు చెప్పుకుంటూ ఉండగా, వీటిపైనే పోరాటం చేపట్టేందుకు టీడీపీ సిద్ధం అవుతోంది.ఏపీ ప్రభుత్వం పై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని భావిస్తూ ఉండగానే, ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కలిసి వస్తుంది అని వైసీపీ భావిస్తూ ఉండగా,  వాటిపైనే టీడీపీ( TDP ) ఫోకస్ పెట్టింది.

వైసీపీ తాజా నిర్ణయం పై ఉద్యోగుల్లో మాత్రం తీవ్ర అసంప్తృప్తి ఉంది.అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ కోసం పెట్టిన షరతులు ప్రకారం కేవలం 10 వేల మంది మాత్రమే ఉద్యోగులు గా మారుతారు .దీనిపైనా అనేక అభ్యంత్రాలు ఉన్నాయి.

Telugu Ap Cm Jagan, Ap, Jagan, Tdp Menifesto, Telugudesam, Ysrcp, Ysrcp Menifest

అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ, పీ ఆర్ సీ బకాయిల చెల్లింపు కోసం 2027 ను డెడ్ లైన్ గా పెట్టారు.అంటే మరో నాలుగేళ్ల పాటు విడతల వారీగా ఈ చెలింపులు చేయనున్నారు.దీంతో ఈ బకాయిల పై పోరాటం చేస్తున్న ఉద్యోగ సంఘాలు అసంతృప్తి తో ఉన్నాయి.

వీటన్నిటి పైన పోరాటం చేపట్టేందుకు టీడీపీ సిద్ధమవుతోంది.జగన్( YS Jagan Mohan Reddy ) ప్రభుత్వం తాజా నిర్ణయాలలోని లోపాలను హైలెట్ చేసుకుని వాటినే తమ మానిఫెస్టో లో పెట్టి ఆయా వర్గాల ప్రజల్లో సానుకూలత పెంచుకునే దిశగా టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube