అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ తాజాగా ఓ కీలక విషయమై నిర్ణయం తీసుకుంది.విషయం ఏమంటే, తన ఫోన్‌లోని వాయిస్ అసిస్టెంట్ ‘హే సిరి’ని.
కాస్త ఎడిట్ చేసి ‘సిరి’గా మార్చబోతోంది.దీనిద్వారా యూజర్లకు కావాల్సిన సమాచారాన్ని ఇంకా వేగంగా ఇవ్వొచ్చని యాపిల్ యాజమాన్యం అభిప్రాయపడుతోంది.
అందుకే తన వాయిస్ అసిస్టెంట్ పేరును కాస్త ఇదేటి చేసి కుదించబోతోంది.కాగా ఇంత చిన్న పేరును మార్చేందుకు యాపిల్ చాలా కఠినంగా కష్టబడుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
తాజాగా యాపిల్ చేయబోతున్న మార్పులు, చేర్పులపై బ్లూమ్ బెర్గ్ ప్రతినిధి అయినటువంటి ‘మార్క్ గుర్మాన్’ తాజాగా ఓ మీడియా వేదికగా వెల్లడించినట్టు తెలుస్తోంది.యాపిల్ గత కొన్ని నెలలుగా ఈ సిరి ఫీచర్‌పైనే హార్డ్ వర్క్ చేస్తోందని, వచ్చే సంవత్సరం లేదా 2024లో ఈ కొత్త ఫీచర్‌ను విడుదల చేయొచ్చుని గుర్మాన్ తన ఊహాగానాలను వ్యక్తం చేసారు.
ఈ ఎడిట్ జరిగిన తరువాత ఐఫోన్ వినియోగదారులు సిరి అని మాత్రమే పిలవాల్సి ఉంటుంది.హే’ను తొలగించడానికి కారణం ఒక్కటేనట.యూజర్లకు మరింత సులభంగా చేసేందుకే.

ఇకపోతే, గతంలో కూడా ఇటువంటి మార్పులను మనం చూసాం.వాటిబాటలోనే ఆపిల్ నడుస్తోంది.అమెజాన్ వాయిస్ అసిస్టెంట్ హే అలెక్సా, గూగుల్ హే గూగుల్, మైక్రోసాఫ్ట్ హే కోర్టానా పేర్లను కూడా ఇదేవిధంగా ఎడిట్ చేయడం జరిగింది.
ఇక్కడ వారి కోసం హే అనే పదాన్ని తొలగించి అలెక్సా, కోర్టానా అని జోడించాయి.అదేమాదిరి ఆపిల్ కస్టమర్లు వాయిస్ అసిస్టెంట్‌ను సిరి అని పిలించేందుకు ఇష్టపడుతున్నారు.
అందుకే వాటి తరహాలోనే రెండు అక్షరాలతో వాయిస్ అసిస్టెంట్ పనిచేసేలా ఫీచర్‌ను బిల్డ్ చేస్తున్నాయి.







