హైదరాబాద్ నేరేడ్మెట్లో దారుణ ఘటన చోటు చేసుకుంది.కన్న కొడుకును అత్యంత కిరాతకంగా కొట్టి చంపాడు ఓ కసాయి తండ్రి.
ఈ విషాద ఘటన జేజే నగర్ లో జరిగింది.మద్యం మత్తులో ఉన్న తండ్రి తన రెండేళ్ల కుమారుడిని కొట్టి చంపాడు.
చిన్నారి ఏడుస్తుండటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.







