TDP Bjp :ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయం

ఏపీ రాజకీయాలు బాగా హీటెక్కాయి.

ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో పొత్తులు, ఎత్తులు , సీట్ల సర్దుబాటుతో పాటు , ప్రజలను ఆకట్టుకునే విధంగా  ఏపీలోని రాజకీయ పార్టీల అధినేతలు బిజీబిజీగా మారిపోయారు .

వచ్చే ఎన్నికల్లో గెలవడం అన్ని పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకం  కావడం తో పూర్తిగా ఈ వ్యవహారాలపైనే దృష్టి పెట్టాయి.  ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీని మళ్లీ అధికారంలోకి రాకుండా చేసేందుకు టిడిపి,  జనసేనలతో పొత్తు పెట్టుకునేందుకు టిడిపి అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి కేంద్రం హోంమంత్రి అమిత్ షా ( Amit Shah )తో మంతనాలు చేశారు.

ఇక ఎన్డీఏలో చేరేందుకు టిడిపి అధినేత చంద్రబాబు సిద్ధమవుతున్నారు.బిజెపితో పొత్తులో భాగంగా ఆ పార్టీ కోరినన్ని అసెంబ్లీ , పార్లమెంటు స్థానాలను కేటాయించేందుకు సిద్ధం అయిపోయారు .

ఇక తమతో పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ను  చంద్రబాబు ఢిల్లీకి పిలిపెంచారు.ఇప్పటికే ఏపీలో బిజెపి , జనసేన లు అధికారికంగా పొత్తు కొనసాగిస్తున్నాయి.ఈ నేపథ్యంలో పవన్, చంద్రబాబు ఢిల్లీలోనే ఉండగా,  ఈరోజు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ఢిల్లీకి వెళ్ళనున్నారు.

Advertisement

  ఏపీ ప్రయోజనాల కోసమే ప్రధాని నరేంద్ర మోది,  అమిత్ షా తో జగన్ భేటీ కానున్నట్లు వైసిపి వర్గాలు పేర్కొంటున్నాయి.చంద్రబాబు , పవన్ ఏపీ రాజకీయాలకు సంబంధించి ఢిల్లీలో బిజెపి పెద్దలతో మంతనాలు  చేసేందుకు ఢిల్లీకి వెళ్ళడం ఆసక్తికరంగా మారింది.

ఏపీ ప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళ్తున్నారని ,నేరుగా ప్రధాని నరేంద్ర మోది( Narendra Modi ) ని,  కేంద్ర హోమం మంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు , నిధుల కోసం జగన్ ఢిల్లీకి వెళుతున్నట్లుగా చెబుతున్నా,  ఢిల్లీలో ఏపీ రాజకీయాలకు సంబంధించి కీలక నిర్ణయం బిజెపి అధినేతలు తీసుకోబోతున్న నేపథ్యంలో జగన్ వారితో భేటీ కాబోతుండడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement

తాజా వార్తలు