పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేసిన మంత్రి కొడాలి నాని..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.ప్రతిపక్షాలకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా .

దాదాపు క్లీన్ స్వీప్ అన్న తరహాలో జగన్ పార్టీ బిగ్ విక్టరీ క్రియేట్ చేయడం జరిగింది.పార్టీ గుర్తులపై జరిగిన ఎన్నికలలో ప్రజలు అసలు బీజేపీ జనసేన కూటమిని పెద్దగా పట్టించుకోలేదు.

ఇటువంటి తరుణంలో ఏపీ మంత్రి కొడాలి నాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు.తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే సమయంలో పవన్ వైఖరి వింతగా ఉంది అన్నట్టు నాని కామెంట్ చేశారు.

సరిగ్గా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే కొద్ది గంటలకు ముందు టిఆర్ఎస్ కి మద్దతిస్తున్నట్లు.ఆయన కామెంట్లు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు.ఇదంతా కేవలం బిజెపిని వదిలించుకోవటానికి పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు అని పేర్కొన్నారు.

Advertisement

  ఎన్నికల ప్రక్రియలో బిజెపి జనసేన కూటమికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పడంతో ఇప్పుడు బీజేపీని వదిలించుకోవడానికి పవన్ రెడీ అవుతున్నాడని ఆరోపించారు.అప్పట్లో వామపక్షాలతో మరియు బీఎస్పీ పార్టీ తో చేతులు కలిపిన పవన్ కళ్యాణ్ ఎన్నికలలో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పే కావాలని వాళ్లని వదిలేశారు, ఇప్పుడు అదే తరహాలో బిజెపి ని కట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారని కొడాలి నాని స్పష్టం చేశారు.

 .

Advertisement

తాజా వార్తలు