కొడాలి నాని మాటల మంటలు ... ఆవేదనలో బాబు ?

ఎప్పుడు వివాదాస్పద విమర్శలతో టిడిపి నాయకులను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేసే ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి ఘాటైన విమర్శలతో టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ల పై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.

విజయనగరం జిల్లా రామతీర్థం లో శ్రీ  రాముడు విగ్రహం ధ్వంసం అయిన ఘటనపై అదేపనిగా వైసిపి ప్రభుత్వం పైన,  జగన్ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్త,  చంద్రబాబును ఉద్దేశించి ఘాటుగా స్పందించారు ఏపీ మంత్రి కొడాలి నాని.

రామతీర్థం లోని శ్రీరామచంద్రుడు విగ్రహాన్ని ధ్వంసం చేసింది చంద్రబాబు అండ్ కో అని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 40 గుళ్లను కూల్పించాడు అని,  అటువంటి వ్యక్తి విపక్షంలో ఉండి, సీఎం జగన్ ను ఇరుకున పెట్టేందుకు విగ్రహ ధ్వంసం చేసే దుర్మార్గమైన చర్యకు దిగాడు అని నాని మండిపడ్డారు.ఈ సందర్భంగా లోకేష్ చంద్రబాబు లపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు.

దేవుడులాంటి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు దేవుడు పైనా, ప్రజాస్వామ్యంపైనా నమ్మకం లేదని, ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి,  ఆయన ఫోటో దండ వేసి దండాలు పెట్టె చంద్రబాబు.దేవుడు విగ్రహాల్ని అదేవిధంగా ధ్వంసం చేసి ఇప్పుడు గగ్గోలు పెడుతున్నాడు అని మండిపడ్డారు.

  రామతీర్థం లో చంద్రబాబు డేరా బాబా అవతారం ఎత్తాడు అంటూ విమర్శిస్తూ అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు.కనీసం వార్డు మెంబర్ కూడా గెలవలేని లోకేష్ జగన్ కు సవాల్ విసరడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.

Advertisement

ప్రజల తిరస్కారానికి గురైన జోకర్ లాంటి లోకేష్ సవాల్ ను జగన్ స్వీకరించాలని కోరడం కామెడీగా ఉంది అంటూ నాని విమర్శించారు.

 నాని వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఈ వ్యవహారంపై టిడిపి అధినేత చంద్రబాబు తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.రాజకీయాలు అన్న తర్వాత విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయని , కానీ ఈ విధంగా ఏకపక్షంగా పరుష పదజాలంతో వ్యక్తిగత విమర్శలకు దిగడం తనకు ఆవేదన కలిగిస్తోందని, ఉద్దేశపూర్వకంగానే సొంత సామాజిక వర్గం నాయకుడు అయినా నానితో జగన్ పరుష పదజాలంతో తిట్టిస్తున్నారని , ఈ తరహ  రాజకీయం ప్రజాస్వామ్యం లో సరికాదంటూ తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు