కొన్నేళ్లుగా ఏపీ ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది..: గవర్నర్ అబ్దుల్ నజీర్

ఏపీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు( Republic Day Celebrations ) ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా జాతీయ జెండాను గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు.

కార్యక్రమానికి సీఎం జగన్ దంపతులు కూడా హాజరయ్యారు.అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్( Governor Abdul Nazeer ) పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ప్రత్యేకతని చెప్పారు.ప్రభుత్వం అంకితభావంతో ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తోందని తెలిపారు.

కుల, మత, రాజకీయ వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.అయితే కొన్నేళ్లుగా ఏపీ ఒడిదొడుకులను ఎదుర్కొంటోందన్నారు.ప్రజల సహకారంతో సమస్యలు అధిగమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.56 నెలలుగా గ్రామ స్వరాజ్యం దిశగా సంస్కరణలు తెచ్చామని వెల్లడించారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు