రమేష్‌ ఆసుపత్రిపై సుప్రీంకు వెళ్లిన ఏపీ ప్రభుత్వం

విజయవాడ రమేష్‌ ఆసుపత్రి కోవిడ్‌ వార్డులో జరిగిన ప్రమాదంలో 10 మంది మృతి చెందిన విషయం తెల్సిందే.

ఆ ప్రమాదంకు రమేష్‌ ఆసుప్రతి యాజమాన్యం నిర్లక్ష వైఖరి కారణం అంటూ ఇప్పటికే ప్రభుత్వం కేసు నమోదు చేసింది.

ఆసుపత్రిపై చర్యలు తీసుకునేందుకు సిద్దం అయిన సమయంలో హైకోర్టుకు వెళ్లిన ఆసుపత్రి యాజమాన్యం మద్యంతర ఉత్తర్వులు తీసుకు వచ్చింది.దాంతో ఆసుపత్రిపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా అయ్యింది.

దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది.ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రతినిధులు పేర్కొన్నారు.సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం.10 మంది మృతికి కారణం అయిన రమేష్‌ ఆసుపత్రిపై చర్యలు తీసుకునేందుకు అనుమతిని ఇవ్వాలని, ప్రమాధ కారకులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలంటూ ఏపీ ప్రభుత్వం పిటీషన్‌ దాఖలు చేసింది.రమేష్‌ ఆసుపత్రి నిర్వాహణలో చాలా లోపాలున్నాయి.

ఆసుపత్రి వర్గాలు మరియు యాజమాన్యం దర్యాప్తుకు సహకరించడం లేదు.అందుకే ఆసుపత్రిపై చర్యలు తీసుకునేందుకు వీలుగా తీర్పు ఇవ్వాలంటూ సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం పిటీషన్‌ దాఖలు చేసింది.

Advertisement

ఈ పిటీషన్‌ కు కౌంటర్‌ దాఖలు చేయాల్సిందిగా రమేష్‌ ఆసుపత్రికి సుప్రీం ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది.

ఓ వైపు కలెక్టరేట్ లో కీలక సమావేశం.. మరోవైపు ఫోన్లో రమ్మీ ఆడుతున్న అధికారి
Advertisement

తాజా వార్తలు