పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు విషయంలో అస్సలు ఆసక్తి చూపించడు.స్టార్స్ అంతా కూడా భారీ వేడుకలు నిర్వహించడం లేదంటే కేక్ కట్టింగ్స్ చేయడం వంటివి చేస్తారు.
కాని పవన్ మాత్రం ఆ విషయంలో ఎప్పుడు కూడా ఉత్సాహం చూపించలేదు.జీవితం మొత్తం మీద పవన్ రెండు మూడు సార్లకు మించి కేక్ కట్ చేసి ఉండడు.
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు.కాని ఆయన అభిమానులు మాత్రం పవన్ పుట్టిన రోజు అంటే రాష్ట్ర పండుగంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు.
ఇక ఆయన అంటే అభిమానం ఉన్న ఎంతో మంది సెలబ్రెటీలు మరియు ప్రముఖులు రాజకీయ నాయకులు పవన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈసారి ఆశ్చర్యకరంగా పవన్ కళ్యాణ్ తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియ జేసిన ప్రతి ఒక్క ప్రముఖుడికి కూడా రిప్లై ఇచ్చారు.
యంగ్ హీరోలు హీరోయిన్స్ టెక్నీషియన్స్ దర్శకులు రాజకీయ నాయకులు ఇలా వందల మందికి పవన్ రిప్లై ఇచ్చాడు.వారి వారి భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు శుభాకాంక్షలు చెబుతూ కృతజ్ఞతలు చెప్పడంతో అంతా కూడా ఫిదా అవుతున్నారు.
ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ పవన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు.కార్తికేయకు కృతజ్ఞతలు మీ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు ఆల్ ది బెస్ట్ సర్ అంటూ రిప్లై ఇచ్చాడు.
ఇలా తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన యంగ్ స్టార్స్ మరియు సెల్రబెటీలందరికి కూడా పవన్ కృతజ్ఞతలు చెప్పాడు.