ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ మధ్య ఏ స్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు చెలరేగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.మొదటి నుంచి వైసీపీ వైఖరిని పవన్ తప్పు పడుతూ ఉంటే, పవన్ అడుగడుగునా ఇబ్బంది పెట్టే విధంగా వైసీపీ వ్యవహరిస్తోంది.
ఇప్పటి కే ఆ రెండు పార్టీల మధ్య రాజకీయ వైరం తీవ్ర స్థాయిలో ఉంది.ఇప్పటికీ పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపుతూ నిరసన కార్యక్రమాలు, ప్రజాఉద్యమాలు చేపడుతూ, వైసిపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూనే ఉండగా, వైసిపి కూడా పవన్ టిడిపి కి మద్దతుదారుడు అని, చంద్రబాబు కనుసన్నల్లోనే పవన్ నడుస్తారని ఇలా విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు.
ఇప్పటికీ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ ద్వారా పవన్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు .అయితే ఈ విమర్శలకు ఘాటుగా ఇప్పుడు సమాధానం ఇచ్చారు పవన్ సోదరుడు నాగబాబు.

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు వైసీపీ ప్రయత్నించిందని నాగబాబు సంచలన విషయాలు బయట పెట్టారు.అయితే అంతకు ముందే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు గురించి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా, రెండు పార్టీలు ఆ విషయాన్ని ఖండించాయి.అయితే ఇప్పుడు మాత్రం వైసీపీ తమతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నించిందని, ఈ మేరకు ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా తమ ఇంటికి విజయసాయిరెడ్డి వచ్చారని, పవన్ తో పొత్తు పెట్టుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ చెప్పారని విషయాన్ని అనే విషయం ఇప్పుడు నాగబాబు ప్రకటించారు.అయితే ఎప్పుడో జరిగిన విషయం ఇప్పుడు నాగబాబు బయటపెట్టడం వెనుక కారణం కూడా లేకపోలేదు.
కొద్దిరోజులుగా విజయసాయిరెడ్డి పవన్ జనసేన పార్టీని విమర్శిస్తూ మాట్లాడ్డం నాగబాబు కు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది.
ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ తో పొత్తు కోసం ప్రయత్నించి ఇప్పుడు ఈ విధంగా తీవ్ర విమర్శలు చేయడంపై నాగబాబుకి ఆగ్రహాన్ని కలిగిస్తోంది.
అందుకే అక్కడి విషయాన్ని ఇప్పుడు బయటపెట్టి విజయసాయి రెడ్డి తీరుని తప్పు పడుతున్నారు.అంతేకాకుండా విజయసాయిరెడ్డిని గుంటనక్క తో పోల్చి మరి నాగబాబు విమర్శలు చేస్తుండడం ఏపీ లో హాట్ టాపిక్ గా మారింది.
కరోనా విజృంభిస్తున్న సమయంలో పవన్ తాను రాజకీయాల గురించి మాట్లాడను అని ప్రకటించడం, ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో పవన్ అధికార పార్టీపై విమర్శలు చేస్తుండడంతో, విజయ్ సాయి ఇపుడు పవన్ తప్పు పడుతునాన్రు.దీంతో ఇప్పుడు ఎప్పుడో జరిగిన విషయాన్ని నాగబాబు బయటపెట్టినట్లు అర్థమవుతోంది.
దీనిపై విజయసాయి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.