శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు అధికారిక లాంఛనాలతో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

ఢిల్లీ అధికారిక పర్యటన నిమిత్తం వెళ్ళిన సీఎం జగన్ అటు నుండి అటుగా నేరుగా తిరుపతి వెళ్లారు.

అక్కడ మంత్రులు నానితో పాటు టిటిడి అధికారులు మరియు బోర్డు సభ్యులు సీఎం జగన్ కి సాగర్ ఆహ్వానం పలికారు.స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ నేడు రాత్రి అక్కడే బస చేయనున్నారు.

రేపు తెల్లవారు జామున మరోసారి స్వామి వారిని దర్శించుకొని ఆ తర్వాత అమరావతి బయలుదేరనున్నారు.సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించే ముందు డిక్లరేషన్ తప్పనిసరిగా ఇవ్వాలంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు బిజెపి నాయకులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు మాత్రం డిక్లరేషన్ తప్పని సరి కాదంటూ పేర్కొన్నారు.

సీఎం జగన్ స్వామి వారి దర్శనానికి ముందు డిక్లరేషన్ లో సైన్‌ చేశారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement
నా భార్యను క్షమించమని అడిగాను.. పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు