మార్పులు చేర్పులు : సంచలన నిర్ణయాల దిశగా జగన్ అడుగులు ?

ఎప్పటికప్పుడు సంచలనం నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్న ఏపీ సీఎం జగన్ ఇప్పుడు ఏపీలో మరికొన్ని సంచలనం సృష్టించేందుకు సిద్ధమైపోతున్నారు.

ఇప్పటికీ ఏపీలో శాసన మండలి రద్దు, మూడు రాజధానులకు మద్దతుగా అసెంబ్లీ లో బిల్లులు పాస్ చేయించడం ఇలా అనేక విషయాల్లో దూకుడు వ్యవహరించిన జగన్ ఇక పూర్తిస్థాయి ద్రుష్టి మొత్తం పరిపాలన, పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టేందుకు చూస్తున్నారు.

అలాగే శాసన మండలి వద్దు అవడంతో చాలామంది వైసిపి నాయకులు రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోబోతున్నారు.వీరితో పాటు జగన్ కు అత్యంత సన్నిహితులైన చాలామంది మంత్రి పదవుల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో తన మంత్రివర్గాన్ని మూడు విడతలుగా పరిమితం చేయాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఇదే విషయమై పార్టీ కీలక నాయకులు, ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లతో జగన్ చర్చించినట్లుగా అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

  చాలా మంది ఎమ్మెల్యేలు జగన్ క్యాబినెట్ లో తమకు స్థానంలో దక్కుతుందని భావించారు.అయితే ఎవరూ ఊహించని విధంగా జగన్ సామజిక సమీకరణలకు పెద్ద పీట వేయడంతో ఆశావాహుల ఆశలకు గండిపడింది.దీంతో వారిలో అసంతృప్తి బహిరంగంగానే రేగడం, ఆ ప్రభావం ప్రభుత్వం మీద పడడంతో ఈ అసంతృప్తిని చల్లార్చేందుకు నామినేటెడ్ పోస్టుల భర్తీ చేసి తాత్కాలిక ఉపశమనం కలిగించారు జగన్.

Advertisement

మరికొంతమందికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తానని జగన్ వాగ్దానం చేశారు.అయితే ఇప్పుడు శాసనమండలి రద్దు కాబోతున్న నేపథ్యంలో వీటిపైన ఆశలు పెట్టుకున్న వారంతా ఇప్పుడు ఉసూరుమంటున్నారు.

  ఇక ప్రభుత్వం ఉన్నా తమ రాజకీయ జీవితం సాఫీగా సాగడంలేదనే బాధ వారిలో ఎక్కువయ్యింది.ఈ పరిస్థితుల్లో నామినేటెడ్ పదవుల్లో ఉన్న ఎమ్మెల్యేలను వెనక్కి పిలిచి ఆ పోస్టులను ఎమ్మెల్సీలకు ఆ నామినేటెడ్ పోస్ట్ లు అప్పగించేందుకు జగన్ కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టి స్వల్పకాలానికి మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని జగన్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

ఈ మంత్రి వర్గ విస్తరణలో పార్టీకి వీరవిధేయులుగా ఉన్నవారికి పదవులు ఇవ్వడంతో పాటు ప్రభుత్వం తరపున గట్టి వాయిస్ ఇచ్చే నాయకులకు పెద్ద పీట వేయాలని జగన్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.దీనిలో భాగంగానే మరికొద్ది రోజుల్లో క్యాబినెట్ లో మార్పులు చేర్పులు చేసేందుకు జగన్ ఆలోచిస్తున్నట్టు సమాచారం.

బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ.. మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు
Advertisement

తాజా వార్తలు