టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యాడు.ఈ సినిమాను ప్రేమికుల రోజు సందర్భంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
ఈ సినిమాలో విజయ్ నలుగురు బ్యూటీలతో రొమాన్స్ చేస్తూ అందరినీ అవాక్కు చేస్తున్నాడు.కాగా క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు ఫైటర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసి, షూటింగ్‌ను ఇప్పటికే ప్రారంభించారు.కాగా ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను ఇప్పటికే పూర్తి చేశారు చిత్ర యూనిట్.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ బాక్సర్‌గా కనిపిస్తాడు.దీని కోసం ప్రత్యేకంగా థాయిలాండ్‌లో మార్షల్ ఆర్ట్స్‌లో ట్రెయినింగ్ కూడా తీసుకున్నాడు విజయ్.
కాగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ చాలా విభిన్నంగా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా అనన్య పాండే నటిస్తోండగా, రమ్యకృష్ణ ఓ కీలకపాత్రలో నటిస్తోంది.
చార్మీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ రిలీజ్ చేస్తున్నారు.మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటుందో చూడాలి.







