ఆ సామాజికవర్గం పై జగన్ ఇప్పుడు ఎందుకు దృష్టిపెట్టాడు ?

మనం బలపడాలంటే మన శత్రువు బలహీనపడాలనే సూత్రాన్ని వైసీపీ అధినేత జగన్ బాగా అర్ధం చేసుకున్నట్టున్నారు.అందుకే ఇప్పుడు సరికొత్త రాజకీయానికి జగన్ పదునుపెట్టారు.

ప్రస్తుతానికి జగన్ ప్రభుత్వానికి ఈ ఐదేళ్లపాటు ఎటువంటి ఇబ్బంది లేకపోయినా ఆ తరువాత కూడా తమ పార్టీకి తిరుగుండకూడదన్న ఆలోచనలో జగన్ ఉన్నారు.అందుకే పాదయాత్రలో తాను ఇచ్చిన అతి భారీ హామీలను కూడా అమలు చేసుకునే పనిలో పడ్డాడు జగన్.

అందుకు అనుగుణంగానే జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టారు.వైసీపీకి రాజకీయంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే తెలుగుదేశం పార్టీని బలహీన పర్చడంతో పాటు తమ ఓటు బ్యాంకును మరింత పెంచుకోవాలని జగన్ చూస్తున్నారు.

  ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సంక్షోభంలోనే కొట్టుమిట్టాడుతోంది.ఇప్పటికే ఆ పార్టీ నాయకులు చాలామంది బీజేపీ తీర్థం పుచ్చుకోగా మరికొంతమంది వైసీపీ వైపు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.మెల్లి మెల్లిగా టీడీపీని బలహీనపరచాలనే ఆలోచనలో జగన్ ఉన్నాడు.

Advertisement

అందుకే రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ఏ సామాజికవర్గమూ మద్దతివ్వకుండా ముందుగానే ప్లాన్ చేసుకుంటూ సరికొత్త రాజకీయానికి నాంది పలుకుతున్నాడు.దీనిలో భాగంగానే ఏపీలో మెజార్టీ సామాజికవర్గంగా ఉన్న కాపులను చేరదీసి పనిలోపడ్డాడు.

  2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మద్దతుతో కాపు సామాజిక వర్గం చంద్రబాబుకు అండగా నిలిచింది.దీంతో టీడీపీ సులువుగా విజయాన్ని తన ఖాతాలో వేసుకోగలిగింది.అయితే ఎన్నికల్లో చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ఆ సామాజికవర్గం ఆగ్రహం బాబు ప్రభుత్వం చూడాల్సి వచ్చింది.

  అయితే జగన్ మాత్రం ఆ విషయంలో బాబు చేసిన తప్పు చేయకుండా తన పాదయాత్రలో కాపు రిజర్వేషన్లపై ముక్కుసూటిగా మాట్లాడేశారు.అది తన చేతిలో లేదని, కేంద్ర ప్రభుత్వమే చేయాల్సి ఉంటుందని చెప్పి అప్పట్లో కొంత వ్యతిరేకతను మూటగట్టుకున్నారు.దీంతో ఆ సామాజికవర్గం అంతా పవన్ వైపు నిలబడ్డారు.

కానీ పవన్ ను వారు పూర్తి స్థాయిలో నమ్మలేకపోవడంతో జనసేనకు కూడా వారు దూరంగా ఉంటున్నారు.ఈ పరిస్థితుల్లో ఆ సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు జగన్ పావులుకదుపుతున్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

ఇప్పటికే ఆ సామాజికవర్గం నేతలు తోట త్రిమూర్తులు, ఆకుల సత్యనారాయణ వంటి నేతలను పార్టీలోకి చేర్చుకున్నారు.ప్రస్తుతం వీరి అవసరం జగన్ కు లేకపోయినా భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఆ సామజిక వర్గ నేతలను దగ్గరచేసుకునే పనిలో జగన్ ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు