ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజీనామా ఎందుకు చేస్తారు? రాష్ట్రంలోని 50 శాతం పైగా ప్రజలు ఓట్లు వేసి, 151 మంది ఎమ్మెల్యేలతో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం అంటే.ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవహేళన చేసినట్టే అని మేధావులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సుప్రీంకోర్టు తలుచుకుంటే, జగన్మోహన్ రెడ్డి రాజీనామా ఆమోదం సాధ్యం అవుతుంది అని కొందరు చర్చలు పెట్టడం విడ్డూరం అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు పాటించినప్పుడు, ప్రజాస్వామ్య విధానాలకు రాజ్యాంగ విధానాలకు భంగం కలిగించినప్పుడు కోర్టులు కలగజేసుకుని పాలన సజావుగా సాగే విధంగా చర్యలు చేపడతాయి.
కానీ ప్రభుత్వాలను కూలదోసే ప్రయత్నం కోర్టులు చేయవు.అని కొందరు న్యాయనిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాసి సంచలనం సృష్టించడం.అందరికీ విధి తమే.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,మరికొంతమంది తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్నుతున్నారని లేఖలో తెలియజేశారు.ఇటీవల ఏపీ ప్రభుత్వం సలహాదారు అజయ్ కల్లాం నిర్వహించిన ప్రెస్ మీట్ లో న్యాయ వ్యవస్థ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కొందరితో కలిసి జగన్ సర్కారును ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేది ఆ వ్యాఖ్యల సారాంశం గా ఉంది.దీనిపై ఏపీ ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టుకు విన్నవించినట్లు ఆయన తెలియజేశారు.
దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపై కొందరు న్యాయశాస్త్ర నిపుణులు, సీనియర్ లాయర్లు, రిటైర్డ్ జడ్జీలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ముఖ్యమంత్రి జగన్ సీజేఐ కు లేఖ రాయడం గర్హనీయమని, న్యాయ వ్యవస్థ పటిష్టతకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
సీఎం జగన్ రాజీనామా చేయాలంటూ లేఖ రాశారు.దీంతో ఇప్పుడు రాష్ట్రంలో సీఎం జగన్ రాజీనామా లేఖ హాట్ టాపిక్ గా మారింది.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి రాసిన లేఖ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలైంది.కానీ జగన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాడా? అన్న చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది.అయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ సమయంలో రాజీనామా చేయాల్సి వస్తుందో.అలా రాజీనామా చేస్తే, ఎప్పుడు ఆమోదించవచ్చు? అనేదానిపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది.
జగన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం లో 151 మంది ఎమ్మెల్యేలున్నారు.వీరిలో సగం మంది జగన్ ముఖ్యమంత్రిగా వద్దు అనుకుంటే, గవర్నర్ దగ్గరకు వెళ్లి అవిశ్వాస తీర్మానం పెట్టమని కోరుతారు.
దీనికి గవర్నర్ ఆమోదిస్తే తర్వాత అసెంబ్లీలో అవిశ్వాస పరీక్ష పెడతారు.అవిశ్వాస పరీక్షల్లో ముఖ్యమంత్రికి అనుకూలంగా 50 శాతం మందికి పైగా ఎమ్మెల్యేలు మద్దతు తెలిపితే ప్రభుత్వం నెగ్గుతుంది.
లేదంటే ప్రభుత్వం పడిపోతుంది.కానీ జగన్ మోహన్ రెడ్డి అంటే ప్రాణమిచ్చే కొంతమంది ఎమ్మెల్యేలు.
జగన్ ఫోటో పెట్టుకొని గెలిచిన 151 మంది ఇప్పుడు ఆ సాహసం చేసే అవకాశాలు లేవు.జగన్మోహన్ రెడ్డి.
తన పార్టీలో కొత్తవారిని, నీతి, నిజాయితీ కలవారిని, జంపింగ్ లు చేయని వారిని చేర్చుకొని గెలిపించుకున్నారు.
ఇకపోతే మరో పద్ధతిలో సీఎం రాజీనామా ఆమోదం కావడానికి ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రంలో అశాంతి నెలకొన్న పుడు, అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు గవర్నర్ పరిస్థితులను గమనించి, ఇక్కడి పరిస్థితులను కేంద్ర హోం శాఖ మంత్రికి తెలియజేస్తారు.
దీంతో ఈ విషయం రాష్ట్రపతి వద్దకు చేరి అప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
చరిత్రలో చూసుకుంటే కోర్టులు స్వయంగా ఒక ప్రభుత్వాన్ని రద్దు చేసిన ఘటనలు ఎక్కడా లేవు.
ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం లో ఉంటే.రాజ్యాంగ పరిరక్షణ కోసం.
అసమ్మతి లేవనెత్తే విషయాలపై స్టేలు విధించడం, ప్రభుత్వం నిలబడే విధంగా తీర్పు ఇవ్వడం మాత్రమే చేశాయి.తాజాగా కర్ణాటకలో కాంగ్రెస్ మరియు కుమారస్వామి జేడీయూ సర్కార్ కు వ్యతిరేకంగా గళమెత్తిన ఎమ్మెల్యేలను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసి ప్రభుత్వాన్ని కాపాడింది.
ఇలా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడిన ఘన చరిత్ర సుప్రీంకోర్టుకు ఉంది.అయితే ప్రభుత్వాలను కూల్చివేసిన దాఖలాలు లేవు.